iDreamPost
android-app
ios-app

కోరుట్ల దీప్తి మృతి కేసులో బిగ్ ట్విస్ట్! తమ్ముడికి ఆడియో పంపిన చందన!

కోరుట్ల దీప్తి మృతి కేసులో బిగ్ ట్విస్ట్! తమ్ముడికి ఆడియో పంపిన చందన!

జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో దీప్తి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మరణించిన విషయం తెలిసిందే. అయితే దీప్త మరణం తర్వాత తన చెల్లెలు అయినా చందన కనిపించకుండ పోయింది. పెద్ద కూతురు మరణించడం, చిన్న కూతురు అదృశ్యం అవ్వడంతో మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారి ఇంట్లోని కిచెన్ లో ఓడ్కా, బ్రీజర్, నిమ్మకాయలు, వెనిగర్ కనిపించడంతో అందరూ షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలోనే దీప్తి మృతిపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ క్రమంలోనే కనిపించకుండపోయిన దీప్తి సోదరి చందన తాజాగా తమ్ముడికి వాయిస్ మెసేజ్ పంపింది.

దీప్తి చెల్లెలు తమ్ముడికి పంపిన వాయిస్ మెసేజ్ లో ఏముందంటే?

అరేయ్ సాయి.. నేను చందన అక్కను రా. నేను ఒక నిజం చెప్పాలి. రాత్రి అక్క, నేను ఇద్దరం కలిసి మందు తాగుదామని అనుకున్నాము. అందుకే నా ఫ్రెండ్ తో మద్యం తెప్పించాను. అక్క ఓడ్కా తాగింది. నేను బ్రీజర్ మాత్రమే తాగాను. ఇక అక్క తన బాయ్ ఫ్రెండ్ ను పిలుకుంటా అంటే నేనే వద్దు చెప్పాను. ఇక అప్పుడు నేను వెళ్లిపోదామని అనుకున్నాను. ఇదే విషయాన్ని అక్కకు చెబుదామంటే ఆమె అప్పటికే సగం బాటిల్ తాగింది. ఆ తర్వాత ఫోన్ మాట్లాడి సోఫాలో వెళ్లి పడుకుంది. రెండు సార్లు లేపే ప్రయత్నం చేశాను. కానీ, అక్క అస్సలు స్పందించలేదు. ఇక అక్కను డిస్ట్రబ్ చేయొద్దని భావించి ఊరుకున్న. ఇదే మంచి ఛాన్స్ అనుకుని నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. అసలు అక్క ఎలా చనిపోయిందో నాకు తెలియదు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అక్కను చంపే అవసరం నాకు లేదు సాయి, నన్ను నమ్మురా అంటూ దీప్తి చెల్లెలె చందన కన్నీళ్లు పెట్టుకున్న ఆడియోను తన తమ్ముడైన సాయికి వాయిస్ మెసేజ్ పంపింది.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet