iDreamPost
android-app
ios-app

అత్తపై కోడలు దారుణం! ఈ కేసులో మరో షాకింగ్ న్యూస్! కొడుకు కూడా!

పెళ్లి తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవాల్సిన కొడుకులు బాధ్యతారహితంతో ప్రవరిస్తున్నారు. భార్యల చేతిలో కీలు బొమ్మల్లా తయారై కన్నవారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.

పెళ్లి తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవాల్సిన కొడుకులు బాధ్యతారహితంతో ప్రవరిస్తున్నారు. భార్యల చేతిలో కీలు బొమ్మల్లా తయారై కన్నవారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.

అత్తపై కోడలు దారుణం! ఈ కేసులో మరో షాకింగ్ న్యూస్! కొడుకు కూడా!

సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక సంఘటన అందరినీ కలిచివేస్తూనే ఉంది. వివాహం తర్వాత పుట్టింటి వారిని, మెట్టింటి వారిని బాధ్యతగా చూసుకోవాల్సిన పిల్లలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. కష్టపడి పెంచి పెద్ద చేసి ఓ ఇంటివారిని చేసిన తర్వాత, కన్నవారికి విలువ లేకుండా.. నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. ఒకవేళ వారు కలిసే ఉంటే వారి పట్ల బాధ్యతగా ఉండకుండా.. బరువులా భావిస్తున్నారు. తాజాగా, కేరళలో జరిగిన ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న ఓ మహిళ.. అత్త పట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఆ క్రూరత్వానికి వృద్ధురాలి కన్న కొడుకు వంత పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని కొల్లాంలో ఈ సంఘటన జరిగింది. వీడియోలో చూసిన దృశ్యాల ప్రకారం. ఓ మహిళ వృద్ధురాలిని తన ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ.. కిందపడేసి కొడుతూ ఉంది. ఆ వృద్ధురాలు బాధతో ఏడవడం కనిపిస్తోంది. ఆ వివరాల ప్రకారం సదరు మహిళ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతోంది. ఆమె వృద్ధురాలైన తన అత్త పట్ల ఇలా ఘోరంగా ప్రవర్తించింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ మహిళ అలా ప్రవర్తిస్తున్నా సరే.. ఆ వృధురాలి కన్న కొడుకు మౌనంగా చూస్తూ నిలబడ్డాడే కానీ, అడ్డుకోలేదు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చిన కొద్ది సమయంలోనే పోలీసుల వరకు చేరింది.

Sister-in-law is cruel to the aunt! Another shocking news in this case! Even the son!

ఇందుకు సంబంధించిన వీడియో దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త ద్వారా బయటకు వచ్చింది. ఆమె ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “‘వృద్ధులపై వేధింపులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఆందోళనకరం. ఈ మహిళను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోతే వెంటనే అరెస్టు చేయాలి. వృద్ధురాలిని దుర్భాషలాడేందుకు చిన్నారికి కూడా ఆమె శిక్షణ ఇవ్వడం.. నిజంగా కలవరపెట్టే విషయం. దయచేసి పోలీసులను ట్యాగ్ చేయండి” అంటూ కేరళ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది.

దీనిపై వెంటనే కేరళ పోలీసులు స్పదించి నిందితురాలైన మంజుమోల్ థామస్‌ (37)ను అరెస్ట్‌ చేశారు. చిత్రహింసలకు గురైన వృద్ధురాలిని ఎలియమ్మ వర్గీస్‌(80)గా గుర్తించారు. ఆమెను చికిత్స నిమిత్తం చవర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ కు తరలించారు. కాగా, తల్లిదండ్రులు, వృద్ధుల బాగోగులు, సంక్షేమ చట్టంలోని సెక్షన్ 24, IPC 308 కింద.. నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కోడలు అత్త పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదేమైనా , కెమెరాలో వీడియో రికార్డు అవుతున్నా సరే.. ఆమె ఎటువంటి బెదురు లేకుండా ఘోరంగా ప్రవర్తించడం నిజంగా విచారించతగిన విషయం. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.