iDreamPost

డబ్బు కోసం కక్కుర్తిపడ్డ భర్త.. కట్టుకున్న పెళ్లామని కూడా చూడకుండా..!

డబ్బు కోసం కక్కుర్తిపడ్డ భర్త.. కట్టుకున్న పెళ్లామని కూడా చూడకుండా..!

తమిళనాడుకు చెందిన సంతోష్-రేఖ దంపతులు కర్ణాటలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీళ్లు స్థానికంగా ఏవో పనులు చేసుకుంటూ సంసారాన్ని గడిపేస్తున్నారు. అలా కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఓ కుమారుడు జన్మించాడు. దీంతో వీళ్లు ఎంతో మురిసిపోతూ సాఫీగా జీవితాన్ని కొనసాగించారు. కట్ చేస్తే.. వీరి కుటుంబంలో ఉన్నటుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని రేఖ దంపతులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన సంతోష్-రేఖ దంపతులకు గతంలో వివాహం జరిగింది. అప్పటి నుంచి కర్ణాటలోని యలహంకలో నివాసం ఉంటున్నారు. ఇక్కడే పనులు చేస్తూ చాలి చాలని జీతంతో సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక ఏడాది తిరిగే సరికి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అలా వీరి సంసారం సాఫీగానే కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే భర్త డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్య రేఖను వేధించినట్లు తెలుస్తుంది. కాగా, ఇదే విషయమై భార్యాభర్తలు గత కొంత కాలం నుంచి గొడవలు పడుతున్నట్లు సమచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా కూడా ఈ దంపతులు మరోసారి మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే రేఖ ఇంట్లో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ఈ విషయం తెలుసుకుని స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు కూతురిని అలా చూసి గుండెలవిసేలా ఏడ్చారు. అనంతరం.. మా కూతురిని అదనపు కట్నం తేవాలని మా అల్లుడు సంతోష్ వేధించాడని, అతడే రేఖను హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి