karnataka Crime News: 5 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు!

5 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు!

ఈ ఫోటోలో కనిపిస్తున్న మనిషి కాదు మృగం. అవును, తన 5 ఏళ్ల కూతురిని బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇటీవల ఈ కేసును విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న మనిషి కాదు మృగం. అవును, తన 5 ఏళ్ల కూతురిని బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇటీవల ఈ కేసును విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే పోలీసులు సైతం కంటతడి పడుతున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోవడం విశేషం. కొందరైతే తల్లి, చెల్లి, కూతురు అని తేడా లేకుండా మృగాలుగా మారిపోయి ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించి ప్రవర్తించిన ఓ దుర్మార్గుడు.. తన 5 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసును ఇటీవల విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే?

కర్ణాటక చామరాజనగర్ లోని ఓ ప్రాంతంలో సయ్యద్ ముజామిల్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే, అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగి విడాకులు తీసుకున్న ఓ మహిళ గతంలో సయ్యద్ ముజామిల్ ని మూడో వివాహం చేసుకుంది. ఆమెకు 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. అప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. గతంలో సయ్యద్ ముజామిల్ తన 5 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. ఎలాగైన ఆ చిన్నారిపై కోరిక తీర్చుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే ఆ సమయం కోసం ఎదురు చూశాడు. ఇక ఆ రోజు కూడా రానే వచ్చింది. ఓ రోజు ఆ మహిళ కూతురుని భర్త వద్దే వదిలేసి ఏదో పని మీద బయటకు వెళ్లింది. ఇదే మంచి సమయమని భావించిన ఈ దుర్మార్గుడు.. ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారిపై బలవంతంగా అత్యాచారం చేశాడు.

ఇక భార్య ఇంటికి రాగానే కూతురు ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ఆ చిన్నారిని అడగగా.. వచ్చి రాని మాటతో ఆ బిడ్డ తండ్రి చేసిన దారుణాన్ని అంతా వివరించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లి పట్టరాని కోపంతో ఊగిపోయింది. వెంటనే కూతురిని స్థానిక ఆస్పత్రికి తరలించింది. అనంతరం ఆ ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇదే కేసును ఇటీవల విచారించిన కోర్టు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పుతో బాధిత తల్లి సంతోషం వ్యక్తం చేసింది. 5 ఏళ్ల కూతురు అని కూడా చూడకుండా అత్యాచారానికి ఒడిగట్టిన సయ్యద్ ముజామిల్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments