iDreamPost
android-app
ios-app

ప్రతిమ కేసు.. ఆమెను హత్య చేసింది ఎవరో కాదు..!

ప్రతిమ హత్య కేసు కర్ణాటకలో సంచలంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆమెను చంపిన యువకుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు ఆమెను ఎవరు హత్య చేశారో తెలుసా?

ప్రతిమ హత్య కేసు కర్ణాటకలో సంచలంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆమెను చంపిన యువకుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు ఆమెను ఎవరు హత్య చేశారో తెలుసా?

ప్రతిమ కేసు.. ఆమెను హత్య చేసింది ఎవరో కాదు..!

మహిళా అధికారి ప్రతిమ హత్య కేసు కర్ణాటకలో సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఈ మహిళ అధికారి ఉన్నట్టుండి ఇంట్లో శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే ప్రతిమను హత్య చేసిన నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఇంతకు ఆమెను హత్య చేసింది ఎవరు? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలో శివమొగ్గ జిల్లా తీర్థహళ్లీ పరిధిలోని తుడ్కికి గ్రామంలో సత్యనారాయణ-కేఎస్ ప్రతిమ అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చిరాత్ (10) అనే కుమారుడు ఉన్నాడు. అయితే కేఎస్ ప్రతిమ మైనింగ్ ఆండ్ జియలాజీ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. విధులు నిమిత్తం ఆమె చోట్ల నివాసాన్ని మార్చారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి దంపతుల మధ్య వివాదాల కారణంగా ప్రతిమ దొడ్డకల్లసంద్రంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటుండగా, కుమారుడు మరో చోట ఉంటూ చదువుకుంటున్నాడు. భర్త కూడా మరో చోట ఉంటున్నారు. ఇక ఎప్పటిలాగే శనివారం విధులు మిగించుకున్న ప్రతిమను ఆమె డ్రైవర్ కారులో ఇంటి దగ్గర వదిలేసి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కట్ చేస్తే.. ఆదివారం ఉదయం కల్లా ప్రతిమ తన గదిలో దారుణ హత్యకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రతిమ వద్ద గత ఐదేళ్లుగా డ్రైవర్ గా పని చేసిన కిరణ్ అనే యువకుడే ఆ మహిళా అధికారిని హత్య చేసినట్లుగా సమాచారం. దీంతో పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేసి విచారించగా.. తనను ఉద్యోగం నుంచి తీసేసిందని, ఈ కోపంతోనే ఆమెను హత్య చేశానని ఆమె మాజీ డ్రైవర్ కిరణ్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ఇదే ఘటన ఇప్పుడు కర్ణాటకలో సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి