Uppula Naresh
ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
Uppula Naresh
ఈ మధ్య కాలంలో కొందరు మద్యానికి బానిసవుతున్నారు. తాగుడే పనిగా పెట్టుకుంటూ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక కుటుంబాన్ని గాలి కొదిలేసి మద్యానికి డబ్బులు లేకపోవడంతో చివరికి దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య గొడవలకు, విడాకులకు మద్యం కూడా ఓ కారణంగా చెప్పువచ్చు. ఇలా తాగుడుకు బానిసై ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి మద్యానికి అలవాటు పడ్డాడు. రోజూ అదే పనిగా తాగుతూ ఉండేవాడు. తాజాగా మద్యానికి డబ్బులు లేకపోవడంతో భార్యను అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో అదే కోపంలో భార్యను హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం రాయ్ చూర్ లింగసగూర్ పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే బసవరాజ్-సునీత (28) దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే జీవించారు. కానీ, రాను రాను భర్త బసవరాజ్ మద్యానికి బానిసయ్యాడు. తరుచు తాగొచ్చి రాత్రిళ్లు ఇంట్లో భార్యతో గొడవకు దిగేవాడు. అయితే, చేసిన కష్టం అంతా బసవరాజ్ తాగుడికే ఖర్చు చేస్తుండడంతో ఇంట్లో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో సునీత కూలీ పనులు చేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఇకపోతే, ఆదివారం సాయంత్రం కూడా బసవరాజ్ మద్యం తాగి ఇంటికొచ్చాడు. నాకు మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ భార్యను అడిగాడు. లేవంటూ సునీత సమాధానమిచ్చింది.
ఈ క్రమంలోనే భర్త బసవరాజ్ భార్య సునీతతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన ఈ దుర్మార్గుడు ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో దాడికి దిగాడు. ఇతని దాడిలో సునీత రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సునీతను ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు షాక్ కు గురవుతున్నారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సునీత మృతితో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.