iDreamPost

భర్తను దారుణంగా హత్య చేసిన భార్య! ఎందుకో తెలుసా?

భర్తను దారుణంగా హత్య చేసిన భార్య! ఎందుకో తెలుసా?

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను అతి దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకలంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ తన భర్తను ఎందుకు హత్య చేసింది? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గోదావరిఖని పరిధిలోని మార్కేండయ కాలనీలో కొచ్చర్ల ప్రవీణ్ (42)-లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లల సంతానం. ప్రవీణ్ స్థానిక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు. అయితే ఈ క్రమంలోనే మొగుడు పరాయి మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తరుచు భర్తతో గొడవకు దిగేది. ఇంతే కాకుండా ఆస్తి వ్యవహరాల గురించి ఏం చెప్పేవాడు కాదని కోపం పెంచుకుంది. ఇక లలిత ఎలాగైన భర్తను చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే మొగుడి వద్ద పని చేసే ఓ వ్యక్తి సాయం కోరింది.

దీనికి అతడు కూడా సరే అన్నాడు. ప్లాన్ ప్రకారమే ఈ నెల 10న భర్త ప్రవీణ్ అర్థరాత్రి ఇంట్లో నిద్రపోయి ఉన్నాడు. ఇదే సమయంలో అతడిని ఇంటికి పిలిచి ప్రవీణ్ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఈ విషయం తెలుసుకుని మృతురాలి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి