iDreamPost
android-app
ios-app

సరిత షాకింగ్ డెసిషన్.. అందరూ నిద్రపోయింది చూసి..!

  • Published Oct 12, 2023 | 1:46 PM Updated Updated Oct 12, 2023 | 1:46 PM
  • Published Oct 12, 2023 | 1:46 PMUpdated Oct 12, 2023 | 1:46 PM
సరిత షాకింగ్ డెసిషన్.. అందరూ నిద్రపోయింది చూసి..!

నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరిత అనే వివాహిత బుధవారం తెల్లవారు జామున అందరూ నిద్రపోయింది చూసి ఊహించని డెసిషన్ తీసుకుంది. ఆమె చేసిన పనికి భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు షాక్ గురవుతున్నారు. ఆ తర్వాత సరిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో సరిత (30) అనే వివాహిత నివాసం ఉంటుంది. తరుచు అత్తింట్లో గొడవలు జరిగేవని తెలుస్తుంది. తాజాగా మరోసారి గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. బుధవారం తెల్లవారు జామున ఇంట్లో అందరూ నిద్రపోయింది చూసి సరిత ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదయం ఈ సీన్ చూసి అత్తింటి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు.

ఈ విషయం తెలుసుకుని మృతురాలి కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇక సరితను అలా చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి తండ్రి ఆమె అత్తింటి కుటుంబ సభ్యులపై అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş