Krishna Kowshik
తొలుత అతడి ప్రేమను కాదంది. అతడు వదలకుండా వెంటపడటంతో పాటు.. నువ్వు లేకపోతే నేను లేనని చెప్పడంతో.. అతడి లవ్ రియల్ అని భావించింది అఖిల. కానీ చివరకు ప్రియుడు మోసం చేశాడు. ఈ విషయాలు ఆమె తన
తొలుత అతడి ప్రేమను కాదంది. అతడు వదలకుండా వెంటపడటంతో పాటు.. నువ్వు లేకపోతే నేను లేనని చెప్పడంతో.. అతడి లవ్ రియల్ అని భావించింది అఖిల. కానీ చివరకు ప్రియుడు మోసం చేశాడు. ఈ విషయాలు ఆమె తన
Krishna Kowshik
ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో.. తట్టుకోలేక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బాలబోయిన అఖిల ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. ప్రేమ అని వెంట పడ్డాడు అఖిల్ సాయి గౌడ్. నువ్వు లేకపోతే నా జీవితమే లేదన్నాడు. నువ్వు కాదంటే చస్తా అని కూడా బెదిరించాడు. అతడి ప్రేమకు నిజమైనదని భావించిన అఖిల.. లవ్ యాక్సెప్ట్ చేసింది. ఆమె లవ్ గురించి ఇంట్లో కూడా చెప్పింది. ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లి కూడా చేద్దామని అనుకున్నారు. అప్పటి నుండి ప్రియుడి అసలు రంగు బయటపడింది. అఖిలను హింసించడంతో పాటు.. రూ. 70 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టడం స్టార్ట్ చేశాడు. చివరకు పెళ్లి చేసుకోనని చెప్పేసరికి తాను మోసపోయానని భావించిన అఖిల ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఆమె చనిపోయే ముందు 14 పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో అతడు చేసిన చీటింగ్ రాసుకొచ్చింది. అలాగే అమ్మనాన్నలను క్షమించాలంటూ రాసుకొచ్చింది. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆ ఆత్మహత్య లేఖ క్లుప్తంగా ‘ అఖిల్.. ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఇదంతా నిజమని నమ్మా.. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని. మంచివాడని నమ్మి మోసపోయా, అమ్మా నాన్న నన్ను క్షమించండి. నడి రోడ్డులో వాడు నన్ను తిట్టినా, కొట్టినా ఎనిమిదేళ్లుగా భరాయించా. డిగ్రీ చదివిన నేను.. అఖిల్ పెద్దగా చదువుకోలేదని తెలిసినా కూడా ప్రేమించా. కానీ వాడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి, చివరకు చేసుకోనని మోసం చేశాడు. ఈ మోసాన్ని పెద్దల్లో పెట్టినా అతడిలో మార్పు రాలేదు.
ఇంకా నాకే ఫోన్లు చేసి నరకం చూపించాడు. మరో అమ్మాయి ఈ దుర్మార్గుడికి బలి కాకుండా చూడండి. పోలీసులు, కోర్టులు వాడిని శిక్షించకపోయినా ఆ దేవుడు తగిన శిక్ష వేస్తాడని నమ్ముతున్నా’ అని ఆత్మహత్య లేఖలో పేర్కొంది. గాజులరామారం రోడ్డులోని ఎన్‌ఎల్‌బినగర్‌కు చెందిన బాలబోయిన అఖిల సూసైడ్ నోటు సారాంశం అది. జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని అదే ప్రాంతానికి చెందిన ఓరుగంటి వెంకటేష్ గౌడ్ కుమారుడు, ప్రస్తుతం ఎన్‌ఎల్‌బినగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అఖిల్‌సాయిగౌడ్ ఆమెను ప్రేమించాడు. గత ఎనిమిది సంవత్సరాలుగా అఖిల వెంట పడ్డాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరించాడు. ఆమె ఒప్పుకున్నాక.. కండిషన్లు పెట్టి , చివరకు పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పాడు. ఈ మోసాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. కాగా, నిందితుడు అఖిల్ సాయి గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.