Tirupathi Rao
Bombay High Court On Pocso Case: పోక్సో కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Bombay High Court On Pocso Case: పోక్సో కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Tirupathi Rao
మైనర్లపై జరిగే ఘోరాలు, అఘాయిత్యాలను అరికట్టేందుకు, దోషులకు శిక్షలు విధించేందుకు పోక్సో చట్టం పనిచేస్తూ ఉంటుంది. పోక్సో కేసులో దోషిగా తేలిచే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. అలాంటి ఒక కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఆ కేసులో నిందితుడిగా అరెస్టైన వ్యక్తికి షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వారి మధ్య ఉన్నది ప్రేమ మాత్రమేనని.. కామం కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది.
పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయితే దాదాపు జీవితం జైలుకే పరిమితం అని అంతా ఫిక్స్ అయిపోతారు. కానీ, ఈ యువకుడి విషయంలో మాత్రం అంతా మారిపోయింది. 13 ఏళ్ల మైనర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనిపై కేసు నమోదు అయ్యింది. అయితే వాదనలు విన్న తర్వాత కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్లిద్దరు రిలేషన్ ఉన్నారని.. వారి మధ్య ఏర్పడింది లైంగిక సంబంధం కాదని.. ప్రేమంటూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఊర్మిళ జోషీ వ్యాఖ్యానించారు. బాలిక మైనర్ అయినప్పటికీ బాలిక తన ఇష్టపూర్వకంగానే ఇంటిని వదిలి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం కారణంగానే లైంగికంగా దగ్గరయ్యారని వ్యాఖ్యానించారు. నిందితుడు కావాలని లైంగిక వాంఛతో ఆమెకు శారీరకంగా దగ్గర కాలేదంటూ చెప్పారు. అతను కామ వాంఛలతో మైనర్ ని వేధింపులకు గురి చేయలేదని తెలిపారు. అది ఆమపై బలవంతంగా జరిగిన దాడి కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ని కూడా మంజూరు చేశారు.
13 ఏళ్ల బాలిక తమ ఇంటి పక్కన ఉండే నితిన్ దామోదర్ ధబేరావును ప్రేమిచింది. అతనితో కలిసి జీవించాలని కోరుకుంది. దామోదర్ కూడా బాలికపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. 2020 ఆగస్టు నెలలో దామోదర్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. పోతూ పోతూ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తనతో తీసుకెళ్లింది. దామోదర్ తో కలిసి కొన్ని రోజులు జీవించింది. బాలిక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలిక ఆచూకీని కనిపెట్టారు. ఆగస్టు 30న దామోదర్ ధబేరావుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అక్టోబర్ లో అతనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారింది.
దామోదర్ ను ప్రేమించడం వల్లే తాను ఇల్లు వదిలి వెళ్లిపోయాయని చెప్పింది. తనని పెళ్లి చేసుకుంటానని దామోదర్ హామీ ఇచ్చాడంది. అందుకే డబ్బు, బంగారం తీసుకెళ్లాని చెప్పింది. తన ఇష్టపూర్వకంగానే ఇదంతా చేశానని స్పష్టం చేసింది. బాలిక వాగ్మూలం ఆధారంగానే బాంబా హైకోర్టు ఇది పోక్సో కేసు అయినా కూడా అతని బెయిల్ మంజూరు చేసింది. అలాగే అదంతా ప్రేమ వల్లే జరిగిందని.. కామం కాదని వ్యాఖ్యానించింది. మరి.. ఈ 13 ఏళ్ల బాలిక 26 ఏళ్ల వ్యక్తిని ప్రేమించడం, పోక్సో కేసులో బెయిల్ మంజూరు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.