Keerthi
ప్రేమ, పెళ్లి, డేటింగ్ ల పేరుతో మోసపోతూ కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా తరుచు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ లో ఏర్పడిన పరిచయాల వలన అనేక ఘోరాలను మనం చూస్తున్నాం.
ప్రేమ, పెళ్లి, డేటింగ్ ల పేరుతో మోసపోతూ కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా తరుచు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ లో ఏర్పడిన పరిచయాల వలన అనేక ఘోరాలను మనం చూస్తున్నాం.
Keerthi
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు కొంపలు ముంచుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిచయాలు అనేవి కొంత మంది జీవితాల్లో ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి, డేటింగ్ ల పేరుతో మోసపోతూ కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా తరుచు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ లో ఏర్పడిన పరిచయాల వలన అనేక ఘోరాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర సంచలనం గా మారింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పరచుకున్న ఓ ఐఆర్‌ఎస్ అధికారి చివరికి ఎంతటి ఘోరానికి ఒడిగట్టేడో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకి ఏం జరిగిందంటే..
ఓ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారికి డేటింగ్ యాప్‌లో శిల్పా గౌతమ్ అనే మహిళ పరిచయమైంది. చాలా కాలం పాటు వారిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. కానీ, ఇంతలో ఏమైందో తెలియదు కానీ, శనివారం అతడి ఫ్లాట్‌లోని ఒక గదిలో సీలింగ్‌కు శిల్పా మృతదేహం వేలాడుతు కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిచండంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చేటు చేసుకుంది.
అయితే ఈ ఘటనలో ఆ ఆధికారి తన కుమార్తేను మోసం చేసి హత్య చేశాడని మహిళ తండ్రి ఆరోపించాడు. ఈ మేరకు మృతురాలి తండ్రి, పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. ఐఆర్‌ఎస్ అధికారి అయిన సౌరభ్ మీనా, బీహెచ్‌ఈఎల్‌లో హెచ్‌ఆర్ అధికారణి శిల్పా గౌతమ్ మధ‍్య మూడేళ్ల కిందట డేటింగ్ యాప్ ద్వారా వారికి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి శిల్పాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సౌరభ్ ఆ తర్వాత ఆమెను మోసగించి భౌతికంగా వేధించడంతోపాటు చివరకు హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, మరోవైపు ఐఆర్‌ఎస్ అధికారి అయిన సౌరభ్ మీనా, శిల్పా తండ్రి ఆరోపణలను సౌరభ్ ఖండించాడు. మూడు నెలల కిందటే డేటింగ్ యాప్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని పోలీసులకు తెలిపాడు. కానీ, తన ఫ్లాట్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పాడు. అయితే సౌరభ్ అస్పష్టంగా, అనుమానం కలింగించే విధంగా ఉండటంతో.. తానే ఈ హత‍్యకు పాల్పడి ఉంటడని పోలీసులు అతని అరెస్టు చేశారు. శిల్పా మరణంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరి.. కారణం ఏదైనాప్పటికి ఓ ప్రాణం బలైపోయింది.