iDreamPost
android-app
ios-app

జేబులో ఒక్కసారిగా పేలిన ఐఫోన్‌!

జేబులో ఒక్కసారిగా పేలిన ఐఫోన్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ కొనాలని అనుకునే వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ప్రజల్ని ఐఫోన్‌ ఇంతలా ఆకర్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో వ్యక్తిగత భద్రత.. ఫీచర్లు ఒక ఎత్తయితే.. ప్రమాదాలు జరక్కుండా ఉండేలా ఈ ఫోన్‌లో తగిన ఏర్పాట్లు ఉండటం  మరో విషయం. నాణ్యతకు తగ్గట్టే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, తాజాగా, జరిగిన ఓ సంఘటన ఐఫోన్‌ ఎంతవరకు సేఫ్టీ అన్న ప్రశ్నకు తెరతీస్తోంది.

ఓ వ్యక్తి జేబులో ఐఫోన్‌ పేలింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన 47 ఏళ్ల ప్రేమ్‌ రాజ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇతడు గత కొంతకాలంగా ఐఫోన్‌ 7 వాడుతూ ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం తన ఫోన్‌ను ప్యాంట్స్‌ జేబిలో వేసుకుని బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ ఒక్కసారిగా హీటవ్వడం మొదలైంది. తర్వాత జేబిలోంచి పొగ వచ్చి.. ఫోన్‌ పెద్ద శబ్ధం చేస్తూ పేలింది. దీంతో ప్యాంట్‌ అంటుకుంది.

అతడు వెంటనే తగిన చర్యలు తీసుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికి ఎడమ తొడ కాలిపోయింది. స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ సంఘటన ఐఫోన్‌ కస్టమర్లలో భయాందోళనలు కలుగ జేస్తోంది. ఇన్ని రోజులు ఎంతో సేఫ్టీ అనుకుంటున్న ఐఫోన్‌లు కూడా పేలితే తమ పరిస్థితి ఏంటన్న మీమాంసలో పడిపోయారు. మరి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉన్న ఐఫోన్‌ జేబిలో పేలటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.