Tirupathi Rao
Pragathi Nagar Viral Case Full Details: ప్రగతి నగర్ వైరల్ మర్డర్ కేసులో అసలు ట్విస్ట్ రివీల్ అయ్యింది. తేజస్ హత్య అసలు ఎందుకు జరిగిందో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Pragathi Nagar Viral Case Full Details: ప్రగతి నగర్ వైరల్ మర్డర్ కేసులో అసలు ట్విస్ట్ రివీల్ అయ్యింది. తేజస్ హత్య అసలు ఎందుకు జరిగిందో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Tirupathi Rao
సాధారణంగా పగలు, ప్రతీకారాలు, కన్నుకి కన్ను అనే థియరీలు సినిమాల్లోనో- నవలల్లోనో చూస్తూ ఉంటారు. కానీ, రియల్ లైఫ్ లో అలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే సామాన్యులకు కాస్త కంగారు, ఆందోళనగానే ఉంటుంది. అయితే అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ మహానగరంలో జరిగింది. ఇటీవల ఒక హత్య నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. యువకుడిని హత్య చేసిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేశారు. ఆ వైరల్ మర్డర్ కి సంబంధించి అసలు విషయాలు, పూర్తి కథ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ హత్య కేసు పూర్తి వివరాలు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. చూస్తే రక్త చరిత్ర సినిమా స్టోరీని తలపిస్తూ ఉంటుంది.
ఏప్రిల్ 8న ప్రగతి నగర్ లో తేజస్ అలియాస్ సిద్ధు అనే కుర్రాడి హత్య జరిగింది. హత్య చేసిన తర్వాత మా మిత్రుడి చావుకు ప్రతీకారం తీర్చుకున్నాం అంటూ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేశారు. ఆ కేసులో పోలీసులు తాజాగా నలగురు మైనర్లు సహా 14 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో అసలు విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య చేయడానికి కారణం తమ మిత్రుడి హత్యకు పగ తీర్చుకున్నారని తెలుస్తోంది. ఏడాది క్రితం తరుణ్ అనే కుర్రాడి హత్యకు ప్రతీకారంగా అతని మిత్రులు ఇప్పుడు తేజస్ అనే కుర్రాడిని హత్య చేశారు. ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తరుణ్ అనే కుర్రాడు షరీఫ్ అనే రౌడీ షీటర్ దగ్గర పని చేసేవాడు. మొదటి స్నేహంగా తిరిగిన వీళ్లు ఆ తర్వాత రెండు గ్యాగులుగా విడిపోయారు. తరుణ్ వేరే కుర్రాళ్లను పోగేసుకుని సెపరేట్ గ్యాంగ్ పెట్టేశాడు. షరీఫ్ చేసే పనులకు ఆటంకం కలిగించడం, ప్రతి విషయంలో వారికి ఎదురెళ్లడం చేస్తుండేవాళ్లు. తరుణ్ విషయంలో షరీఫ్ కు సహనం చచ్చిపోయింది. నా కింద పని చేసిన వాడు నాకు వ్యతిరేకంగా గ్యాంగ్ నడుపుతున్నాడు అంటూ ఊగిపోయాడు. ప్లాన్ చేసి తరుణ్ ని తప్పించాలి అనుకున్నాడు. తేజస్ అలియాస్ సిద్ధుతో తరుణ్ కి ఫోన్ చేయించి ఎస్సార్ నగర్ రప్పించాడు. ఆ తర్వాత తాగుతూ కాసేపు హంగామా చేశారు. తర్వాత షరీఫ్ 50 మందితో వచ్చి తరుణ్ ని కొట్టి హత్య చేశారు.
తరుణ్ తలపై రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రౌడీ షీటర్ షరీఫ్ సహా మిగిలిన వాళ్లను కూడా అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరిగా బెయిల్ పై బయటకు వస్తున్నారు. తేజస్ కూడా ఇటీవలే బెయిల్ విడుదలైనట్లు తెలుస్తోంది. అతను తల్లితో కలిసి ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే తేజస్ హత్యకు తరుణ్ మిత్రులు పక్కా వ్యూహం రచించారు. తేజస్ తో కొందరు స్నేహం చేస్తూ వచ్చారు. ఒకరోజు తేజస్ తల్లి పెళ్లికి వెళ్లిందని తెలిసి.. ఫోన్ చేసి మద్యం తాగేందుకు ఆహ్వానించారు. తేజస్ ని బయటకు తీసుకెళ్లి మద్యం తాగారు. తెల్లవారుజామున 3.30 గంటలకు బతుకమ్మ ఘాట్ దగ్గర తరుణ్ ఫ్రెండ్స్ 10 బండ్లపై 20 మంది వరకు అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లు తేజస్ ని కత్తులతో పొడిచి పొడిచి చంపారు. అతన ఒంటిపై మొత్తం 11 కత్తిపోట్లు ఉన్నాయి.
తేజస్ రక్తం మరకలు ఉన్న కత్తులు చూపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లు, గ్యాంగులను ఏరి పారేస్తామంటూ హెచ్చరించారు. సామాన్యులు, నెటిజన్స్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే విషయం ఏంటంటే ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లంతా 25 ఏళ్లలోపు వాళ్లే కావడం కంగారు పెట్టే అంశం. కుర్రాళ్లు చదువు, కెరీర్ అని కాకుండా ఇలా రౌడీ షీటర్ల వెంట తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ప్రతీకార హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.