P Venkatesh
P Venkatesh
వంటింటి నుంచి అంరిక్షం వరకు మేము ఎందులో తక్కువ కాదు అంటూ అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తుంటే, కొందరు మహిళలు మాత్రం దానికి విరుద్దంగా పయనిస్తున్నారు. సమాజంలో కొందరు మహిళలు చేసే పనులు చీదరించుకునేలా ఉంటున్నాయి. వారు ఎంచుకున్న ఆ చెడు మార్గాలు జీవితాలను అంధకారం చేస్తున్నాయి. ఇదే తరహాలో ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత ఆమె నడిపిన వ్యవహారం అందినీ షాక్ కు గురి చేసింది. ఆ మహిళ చేసిన పనికి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ మహిళ చేసిన ఘన కార్యం ఏంటి? ఆమె గుట్టుగా నడిపిన కథేంటి? చివరికి ఏం జరిగింది? ఆ విషయాలు మీ కోసం..
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని, ఆ తర్వత తరచుగా గోవాకు వెళ్తూ.. డ్రగ్స్ దందాకు తెరలేపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించి ఆ కిలేడి మహిళ వద్ద నుంచి లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనురాధ అనే మహిళ గతంలో తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో తరచు గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసేదని, గోవాలో నైజీరియన్ వ్యక్తి జేమ్స్ తో పరిచయం ఏర్పర్చుకుని డ్రగ్స్ దందాకు పాల్పడిందని వెల్లడించారు. నైజీరియన్ వ్యక్తి దగ్గర తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో రెట్టింపు ధరకు అమ్ముకుని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేదని తెలిపారు.
అనురాధ నైజీరియన్ వ్యక్తి జేమ్స్ వద్ద రూ. 10 వేలకు ఒక్క గ్రామ్ డ్రగ్స్ కొని, దానిని హైదరాబాద్ లో రూ. 20 వేలకు విక్రయించేదని తెలిపారు. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి అనురాధకు సహకరించాడని, గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో సోదాలు నిర్వహించి సుమారు రూ. 14 లక్షల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కిలేడీ మహిళ అనురాధ తో పాటు మరో ముగ్గురిని కస్టడిలోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.