Uppula Naresh
Uppula Naresh
కూతురిని బాగా చదివించి గొప్ప ప్రయోజకురాలిని చేయాలని ప్రతీ తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. ఇందుకోసం మంచి స్కూల్లో చదివిస్తూ ప్రోత్సహిస్తుంటారు. కానీ, కొందరు పిల్లలకు చదువంటే అస్సలు ఇష్టం ఉండదు. దీంతో తల్లిదండ్రులు వారిని బలవంతంగా స్కూల్, ట్యూషన్ కు పంపిస్తుంటారు. ఇది ఇష్టం లేని కొందరు పిల్లలు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే రోజూ ట్యూషన్ కు వెళ్లమంటున్నారని బాలిక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సందీప్ అనే వ్యక్తి చాలా కాలంగా హైదరాబాద్ చందానగర్ పరిధిలోని ఓ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని కూతురు ఆహానా (12) స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో 6వ తరగతి చదువుతోంది. అయితే ఈ బాలిక మ్యాథ్స్ లో కాస్త వీక్ గా ఉండడంతో తల్లిదండ్రులు వీరుంటున్న అపార్ట్ మెంట్ లోనే ట్యూషన్ కు పంపించేవాళ్లు. కానీ, ఆ బాలికకు మాత్రం ట్యూషన్ కు వెళ్లడం అస్సలు ఉండేది కాదని తెలస్తుంది. ఈ క్రమంలోనే అహానా ఎప్పటిలాగే శుక్రవారం స్కూల్ కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బలవంతంగా ట్యూషన్ కు పంపిస్తున్నారని అదే అపార్ట్ మెంట్ లోని 15వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తల్లిదండ్రులు బలవంతంగా ట్యూషన్ కు వెళ్లమంటున్నారని ఆత్మహత్య చేసుకున్న ఈ బాలిక నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.