iDreamPost
android-app
ios-app

వీడియో: ఇంత దారుణంగా ఉన్నారేంటి బ్రో.. కారులో వచ్చి ఇదేం పని!

  • Published Mar 02, 2024 | 4:16 PM Updated Updated Mar 02, 2024 | 4:16 PM

కష్టార్జితాన్ని నమ్ముకొని బతకాలని.. మనకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. కానీ కక్కుర్తితో కొందరు చేసే పనులు చూస్తే ఛీఛీ ఇంత దారుణంగా ఉన్నారేంటని అనిపిస్తూ ఉంటుంది. దానికి ఇదో ఉదాహరణ అని చెప్పొచ్చు.

కష్టార్జితాన్ని నమ్ముకొని బతకాలని.. మనకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. కానీ కక్కుర్తితో కొందరు చేసే పనులు చూస్తే ఛీఛీ ఇంత దారుణంగా ఉన్నారేంటని అనిపిస్తూ ఉంటుంది. దానికి ఇదో ఉదాహరణ అని చెప్పొచ్చు.

  • Published Mar 02, 2024 | 4:16 PMUpdated Mar 02, 2024 | 4:16 PM
వీడియో: ఇంత దారుణంగా ఉన్నారేంటి బ్రో.. కారులో వచ్చి ఇదేం పని!

కష్టార్జితాన్ని నమ్ముకొని బతకాలని పెద్దలు అంటుంటారు. మనకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని చెబుతుంటారు. కష్టాన్ని నమ్ముకుంటే ఏదైనా చేయగలమని.. కాబట్టి నీతిగా, న్యాయంగా బతకాలని సూచనలు చేస్తుంటారు. కానీ దాన్ని పెడచెవిన పెట్టేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఒళ్లు వంచి కష్టం చేసేందుకు కొందరు వెనుకాడతారు. ఏదైనా ఫ్రీగా వస్తే చాలు.. జాలీగా బతికేద్దామని భావిస్తుంటారు. ఏదైనా ఈజీగా దొరుకుతుందంటే ఎలాగైనా దాన్ని దక్కించుకుందామని అనుకుంటారు. ఈ క్రమంలో చోరీలు చేయడం కూడా అలవాటు చేసుకుంటారు. తాజాగా జరిగిన ఓ ఘటనను చూస్తే జనాలకు ఇంత కక్కుర్తి ఎందుకు? అనే ప్రశ్న రాక మానదు. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా అని అసహ్యించుకోవడం పక్కా అనే చెప్పాలి.

వైన్ లోడ్​తో వెళ్తున్న లారీలు, వ్యాన్​లు కింద పడినప్పుడు వాటిల్లో ఉన్న బీర్లు, మందుసీసాలను స్థానికులు ఎత్తుకుపోయిన ఘటనల గురించి వినే ఉంటారు. ఆయా ఘటనల్లో ఫ్రీగా వస్తే మందు బాటిళ్లు ఎత్తుకెళ్లారని అనుకోవచ్చు. కానీ ఇది మాత్రం కక్కుర్తి అంటే ఎలా ఉంటుందనడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్​లోని మాదన్నపేటలో సిలిండర్లతో నిండి ఉన్న ఆటోలో దొంగతనం చోటుచేసుకుంది. మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి చెందిన ట్రాలీని సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపాడు సిబ్బంది. సిలిండర్​ను ఇచ్చేందుకు లోపలకు వెళ్లాడు. అయితే సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు కారును ట్రాలీ వెనుక ఆపారు. ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక సిలిండర్ తీసుకొని కారులో పారిపోయారు. ఈ విజువల్స్ సీసీ ఫుటేజ్​లో రికార్డు అయ్యాయి.

యువకులు సిలిండర్ దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. స్టైల్​గా బడా కారులో నుంచి దిగి ఇలా సిలిండర్ ఎత్తుకుపోవడం ఏంటని షాకవుతున్నారు. ఛీఛీ.. ఇలా తయారయ్యారేంట్రా.. మరీ సిలిండర్ కోసం కక్కుర్తి పడటం ఏంటని సీరియస్ అవుతున్నారు. పాష్​గా కారులో నుంచి దిగి సిలిండర్ కొట్టేశారు.. ఇంత దారుణంగా ఉన్నారేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పని చేసి సంపాదించాలని.. ఇలా దొంగతనంగా తీసుకెళ్లడం ఏంటని చెబుతున్నారు. పాపం.. వీళ్ల వల్ల ఆ ఏజెన్సీ సిబ్బంది ఇబ్బంది పడుంటాడని.. అతడి శాలరీలో నుంచి ఆ సిలిండర్ డబ్బులు కట్ చేసుంటారేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి దొంగతనాలు, కక్కుర్తి పనులు చేసేవారి నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి.. సిలిండర్ చోరీ ఘటనపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భర్తను కాదని, మరో వ్యక్తితో రిలేషన్.. ఆ ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే