iDreamPost

భర్తను కాదని, మరో వ్యక్తితో రిలేషన్.. ఆ ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే

భర్తను కాదనుకుంది.. తన కొడుకుతో కలిసి మరో వ్యక్తితో సహజీవనం స్టార్ట్ చేసింది. ఏడాదికి పైగా హాయిగా సాగిపోయిందా రిలేషన్. అంతలో ఓ కుదుపు.. చివరకు మూడు జీవితాలను నాశనం చేసింది

భర్తను కాదనుకుంది.. తన కొడుకుతో కలిసి మరో వ్యక్తితో సహజీవనం స్టార్ట్ చేసింది. ఏడాదికి పైగా హాయిగా సాగిపోయిందా రిలేషన్. అంతలో ఓ కుదుపు.. చివరకు మూడు జీవితాలను నాశనం చేసింది

భర్తను కాదని, మరో వ్యక్తితో రిలేషన్.. ఆ ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే

ఇటీవల కాలంలో మ్యారేజ్ లైఫ్ మీద కన్నా.. లివ్ ఇన్ రిలేషన్స్‌పై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు యువత. పెళ్లిపై కాస్తంత నెగివిటీ ఉండటంతో పాటు లివ్ ఇన్ అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆ తర్వాత తమ బంధం బలంగా ఉంది అనుకుంటే.. ఏడడుగులు వేయోచ్చు అని యోచిస్తున్నారు. లేకుంటే.. ఇక ఈ రిలేషన్ సెట్ కాదూ అనుకుంటే.. వెంటనే విడిపోయి..ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారుతున్నారు.  అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్ షిప్స్‌లో కూడా అపార్థాలు, అనార్థాలు చోటుచేసుకుంటున్నాయి. సహజీవనం చేస్తున్న వారినే పొట్టన పెట్టుకుంటున్నారు.

భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ.. మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. సంవత్సరం పైగా హ్యపీగా గడిచిపోయిన ఆ బంధంలో ఒక్కసారిగా కుదుపు. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయింది ఆ ఇల్లాలు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంహతి పాల్ అనే మహిళ భర్తకు విడాకులు ఇచ్చి.. కొడుకుతో జీవిస్తోంది. ఆమెకు పరిచయం అయ్యాడు సార్థక్ దాస్. అతడో ఫోటోగ్రాఫర్, పార్ట్ టైంలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఓ సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం అయ్యారు. ఒకరినొకరు కలుసుకుని.. ఆపై లివ్ ఇన్ రిలేషన్ షిప్ స్టార్ చేశారు. వీరిద్దరూ మధుఘర్ డమ్ డమ్ లోని మధుబనీ రోడ్డులో ఓ అపార్ట్ మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు.

సంవత్సరం పాటు హాయిగా సాగిపోయింది. అతడు చనిపోవడానికి ముందు కూడా.. ముగ్గురు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ‘కుటుంబం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆ పిక్ షేర్ చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలో అతడు మృతి చెందాడు. కాగా, సార్థక్ తరచూ తాగి వస్తూ ఉండేవాడు. ఇది సంహతి పాల్‌కు నచ్చేది కాదూ. ఈ విషయంపై వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఓ ఫ్రీ వెడ్డింగ్ ఫోటో సెషన్ ముగిశాక.. తాగి ఇంటికి వచ్చాడు సార్థక్. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సంహిత.. పదునైన కత్తితో అతడిపై పలుమార్లు దాడి చేసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఆమె అపార్ట్ మెంట్‌కు చేరుకున్న పోలీసులు.. అతడిని ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు నిర్ధారించారు. నిందితురాలు.. సంహితను పోలీసులు అదుపులోకి తీసుకుని.. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉంటే.. ఆమె కొడుకును.. అమ్మమ్మ, తాతయ్యకు అప్పగించారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి