Venkateswarlu
ఓ దొంగ.. దొంగతనాలు చేయటంలో తన మార్కును చూపెడుతున్నాడు. తన వైరటీ దొంగతనాలతో పోలీసులనే కాదు.. జనాల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
ఓ దొంగ.. దొంగతనాలు చేయటంలో తన మార్కును చూపెడుతున్నాడు. తన వైరటీ దొంగతనాలతో పోలీసులనే కాదు.. జనాల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
Venkateswarlu
జిహ్మకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు ఒక్కోరి ఆలోచనా విధానం ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది తాము చేసే పని ఏదైనా కొత్తగా.. వెరైటీగా ఉండాలని భావిస్తూ ఉంటారు. అయితే, మంచి పనులు చేయటంలో ఇది బాగా వర్కవుట్ అవుతుంది. కానీ, చెడ్డ పనుల్లో ఇలాంటి వెరైటీలు ఇబ్బంది కొని తెస్తాయి. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ దొంగ.. దొంగతనాలు చేయటంలో తన మార్కు చూపెట్టాలనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. కొత్త దనంతో ఆలోచించాడు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శంకర్ నాయక్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇతగాడు జల్సాకు అలవాటు పడ్డాడు. జల్సాల కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇళ్లలో ఎవ్వరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇళ్లలో దొంగిలించిన వస్తువుల్ని మూత్తూట్ గోల్డ్ లోన్‌లో తాకట్టు పెడుతూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బులతో హోటల్స్‌లో తిరుగుతూ ఉన్నాడు. మిగిలిన డబ్బుతో బైకులు కొన్ని మళ్లీ దొంగతనాలు చేస్తూ ఉంటాడు.
ఇదంతా పక్కన పెడితే.. ఇతడు తాను దొంగతనం చేయటంలో తన మార్కును చాటుకుంటూ ఉన్నాడు. ఎలా అంటే.. దొంగతనం చేసిన ఇంట్లో తాను ఎంత బంగారం, వెండి ఇతర సొమ్ము దోచుకెళ్లాడో ఓ చీటీ రాసి వెళతాడు. శంకర్ నాయక్ ఇప్పటి వరకు 94 దొంగతనాలు చేశాడు. గతంలో ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు అయింది. అయినా అతడు మారలేదు. మళ్లీ దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. తాజాగా, ఓయూ పరిధిలో దొంగతనానికి పూనుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే పోలీసులకు చిక్కాడు. పోలీసులు శంకర్ నాయక్ నుంచి 2 బైకులు, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. శంకర్ నాయక్ ఎందుకు ఇలా చేస్తున్నాడో పోలీసులు వివరించారు. తాను దొంగతనం చేసిన ఇళ్లలో ఎంత సొమ్ముపోయిందో తెలియడానికి.. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు అందకుండా ఉండటానికి. అంతేకాదు! తన డైరీలో ఎవరి ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో కూడా ఓ డైరీలో రాసుకుంటూ ఉంటాడు.
తర్వాత పోలీసులకు దొరికినపుడు తప్పుడు ఆరోపణలు చేయకుండా.. డైరీ ఉపయోగపడుతుంది. దొంగతనాలు చేయటంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడో.. పోలీసులకు దొరికిన తర్వాత ఏం చేయాలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇక, దొంగతనాలు చేయటంలో శంకర్ నాయక్ ప్రత్యేకతను చూసి జనం నోరెళ్ల బెడుతున్నారు. వీడెవడంబీ బాబు.. ఇంత వెరైటీగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. మరి, దొంగతనాలు చేయటంలో తన మార్కును చూపిస్తున్న ఈ వెరైటీ దొంగపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.