iDreamPost
android-app
ios-app

తాగుబోతు మొగుడితో తట్టుకోలేకపోయిన అంజలి! ఇలా అయితే కాదని..!

తాగుబోతు మొగుడితో తట్టుకోలేకపోయిన అంజలి! ఇలా అయితే కాదని..!

ఈ రోజుల్లో మద్యం తాగడం అనేది కాస్త ట్రెండ్ గా మారింది. ఇంటర్ కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు మద్యం సేవిస్తున్నారు. అయితే ఇలాంటి అలవాటు లేని వ్యక్తులను మద్యం తాగే వ్యక్తులు హేళన చేసి మాట్లాడడం కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఓ వ్యక్తి గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి భార్యతో బాగానే సంసారం చేశాడు. అలా కొన్ని రోజులు గడిచాక మద్యానికి బానిసయ్యాడు. ఇక భార్య ఓ చోట పనికి కుదిరింది. దీంతో భర్త రోజూ మద్యం తాగి ఇంటికొచ్చేవాడు. ఇటీవల ఉద్యోగం కూడా మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. భార్యే కష్టపడి పని చేస్తుంటే భర్త మద్యానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడట. దీంతో బుద్దిగా పని చేసుకోవాలని భార్య ఎన్నో సార్లు చెప్పి చూసింది. అతడు అస్సలు లెక్కచేయలేదు. ఇక తాగుబోతు మొగుడితో తట్టుకోలేకపోయిన భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా దరూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అంజలికి నరేంద్ర అనే వ్యక్తితో 2014లో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఈ దంపతులు బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివాసం ఉంటున్నారు. ఇక భర్త ఓ ఆస్పత్రిలో వార్డ్ బాయ్ గా పని చేస్తుండగా, భార్య కాల్ సెంటర్ లో పని చేస్తుంది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంత కాలం నుంచి నరేంద్ర తాగుడుకి బానిసై రోజూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఇక ఇటీవల పని కూడా మానేసి ఇంటి వద్దే ఉండేవాడు.

భార్య కష్టపడి చేస్తుంటే భర్త మాత్రం ఇంట్లోనే ఉండేవాడు. తాగుడుకు డబ్బులు లేకపోవడంతో సెల్ ఫోన్ సైతం అమ్మి తాగేవాడట. పనికి వెళ్లి బుద్దిగా ఉండాలంటూ భార్య అంజలి ఎన్నో సార్లు చెప్పి చూసింది. అయినా భర్త ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇక తాగుబోతు మొగుడితో విసిగిపోయిన ఆ మహిళ.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే అంజలి గురువారం తెల్లవారు జామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అంజలి ఇలా చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: అత్తింటి బంధువులు అనుమానిస్తున్నారని..