iDreamPost

గతేడాది నిశ్చితార్థం.. పెళ్లికి ముందే యువకుడి వరకట్న వేధింపులు!

గతేడాది నిశ్చితార్థం.. పెళ్లికి ముందే యువకుడి వరకట్న వేధింపులు!

వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరువురి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గతేడాది మార్చిలో అమ్మాయి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి భారీ స్థాయిలో నిశ్చితార్థం జరిపించారు. ఈ క్రమంలో వరకట్నం ఇస్తామని యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఎంగేజ్ మెంట్ అయి కొన్ని రోజులు గడిచిందో లేదో ఆ యువకుడు ఓ కండిషన్ పెట్టాడు. పెళ్లికి ముందే వరకట్నం ఇవ్వాలంటూ టార్చర్ పెట్టాడు. రాను రాను ఇతని వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కట్ చేస్తే.. ఆ యువతి ఆ యువకుడికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువతికి, రోహిత్ డెవిడ్ పాల్ అనే యువకుడికి గతేడాది మార్చి 1న ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఇక అదే ఏడాది జూలైలో వివాహం జరిపించాలని ఇరువురి పెద్దలు నిర్ణయించారు. అలా కొన్ని రోజులు గడిచింది. యువకుడు రోహిత్ డెవిడ్ పాల్ పెళ్లికి ముందే ఓ కండిషన్ పెట్టాడు. రెండు కోట్ల కట్నం ఇస్తేనే వివాహం చేసుకుంటానని, అది కూడా పెళ్లికి ముందే ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో రాను రాను ఆ యువకుడి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అతని వేధింపులను ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఇక చేసేదేం లేక ఇటీవల ఆ యువతి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి