దారుణం: హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో ఆరేళ్ల చిన్నారి అదృశ్యం!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఉన్న ఓ 6 నెలల చిన్నారి అదృశ్యం అయ్యాడు. అయితే ఉన్నట్టుండి కుమారుడు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే? ఓ మహిళ తన ఆరు నెలల కుమారుడైన ఫైజల్ ఖాన్ ను చికిత్స కోసం గురువారం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. కాగా, అదే రోజు ఆ చిన్నారిని తల్లి ఎత్తుకుని ఉండగా అటు నుంచి ఓ మహిళ వచ్చి.. కాసేపు నేను ఎత్తుకుంటానంటూ తీసుకుంది. సాయంత్రం 6:30 నిమిషాలకు ఆ చిన్నారి తల్లి ఏదో పని మీద వార్డు లోపలికి వెళ్లి తిరిగి వచ్చే సరికి చిన్నారితో పాటు ఆ బాబును ఎత్తుకున్న మహిళ అక్కడ కనిపించలేదు.

ఉన్నట్టుండి కుమారుడు కనిపించకపోవడంతో తల్లి షాక్ గురైంది. వెంటనే ఆస్పత్రిలో అంతటా వెతికింది. కానీ, ఎక్కడా కూడా ఆ చిన్నారి ఆచూకి దొరకలేదు. ఇక చేసేదేంలేక ఆ మహిళ తన భర్తతో కలిసి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చిన్నారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసులు ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు చుట్టు పక్కల సీసీ కెమెరాలను అన్నీ పరిశీలిస్తున్నారు. అప్పటి వరకు కళ్లముందున్న కుమారుడు ఒక్కసారిగా అదృశ్యం అవ్వడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడస్తున్నారు.

Show comments