iDreamPost
android-app
ios-app

విషాదం.. చెట్టు కూలి ఆటో డ్రైవర్ దుర్మరణం!

  • Published Sep 02, 2023 | 4:30 PM Updated Updated Sep 02, 2023 | 4:30 PM
విషాదం.. చెట్టు కూలి ఆటో డ్రైవర్ దుర్మరణం!

మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు, పాము కాటు, కరెంట్ షాక్ ఇలా పలు రకాలుగా మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా కంటికి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పాత భవనాలు, చెట్లు కుప్ప కూలిపోతున్నాయి. చెట్టు ఆటోపై పడి ఆటో డ్రైవర్ కన్నుమూశాడు. ఈ విషాద ఘటన హైదర్ గూడ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న వై జంక్షన్ వద్ద ఉన్న ఆటో పై చెట్టు కూలి పడిపోయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహమ్మద్ గౌస్ పాషా (34) ఎమ్మెస్ మక్తా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలంగా గౌస్ పాషా రాపిడో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం మధ్యహ్నాం హిమాయత్ నగర్ నుంచి బషీర్ బాగ్ వైపు ఆటోలో వెళ్తున్న సమయంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ రాగానే సిగ్నల్ పడింది. దీంతో గౌస్ పాషా తన ఆటో నిలిపి వేశాడు. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఉన్న భారీ వృక్షం హఠాత్తుగా కూలి నేరుగా ఆటోపై పడటంతో అందులో ఉన్న మహ్మాద్ పాషా అక్కడిక్కడే కన్నుమూశాడు.

ఈ ఘటనలో గౌస్ పాషా ముందు ఉన్న మరో ఆటో కూడా ధ్వంసం అయ్యిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పంపించారు. తర్వాత డీఆర్ఎఫ్ బృందం వారు వచ్చి రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని తొలగించారు. ఇదిలా ఉంటే ఇటీవల భారీ వర్షాలు పడిన కారణంగా పటు చోట వృక్షాలు కూలిపోతున్నాయి. కొంత కాలంగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని హిమాయత్ నగర్ కార్పోరేటర్ మహాలక్షి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని.. ఆటో ప్రమాదంలో చనిపోయని గౌస్ పాషా కి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: దీప్తి కేసులో ట్విస్ట్.. అక్కను చంపింది నేనే : చందన!