మహా ముదురు జంట.. మంచి వాళ్లుగా నటిస్తూనే లక్షలు కాజేశారు

కష్టపడి పనిచేయలేక, మాయ మాటలతో మోసాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు కొందరు. ఇందులో పెట్టుబడి పెట్టండి రెండింతలు పొందండి, ఈ స్కీములో చేరండి కారుతో పాటు లక్షలు కొల్లగొట్టుకోండి అంటూ బురిడీ కొట్టిస్తున్నారు.

కష్టపడి పనిచేయలేక, మాయ మాటలతో మోసాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు కొందరు. ఇందులో పెట్టుబడి పెట్టండి రెండింతలు పొందండి, ఈ స్కీములో చేరండి కారుతో పాటు లక్షలు కొల్లగొట్టుకోండి అంటూ బురిడీ కొట్టిస్తున్నారు.

డబ్బు ఎవరికీ చేదు. కష్టపడి సంపాదించాలంటే కష్టం కనుక.. అడ్డదారుల్లో ఎలా సంపాదించాలా అని ఆలోచన చేస్తున్నారు. మాటల గారడీతో బురిడీ కొట్టించి.. ఓ పంథాలో దుడ్డును కాజేస్తున్నారు. ఈ స్కీమ్‌లో చేరండి.. బంఫర్ ప్రైజ్ మీ సొంతమని, ఇందులో పెట్టుబడి పెట్టండి.. రెండు మూడేళ్లలో రెండింతలు వెనక్కు వస్తుందని చెబుతూ మభ్యపెడుతున్నారు. రూపాయి ఎక్కువ వస్తుందంటే.. పోయేదేముందిలే అని నమ్మి.. డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. తీరా సమయం గడిచాక..అడిగితే అసలు మోసం బయటకు వస్తుంది. వచ్చే రూపాయేమో కానీ.. మొత్తం పోయిందని తెలుసుకునే సరికి లబోదిబోమంటున్నారు. షేర్ మార్కెట్ లో డబ్బులు పెడితే.. డబుల్ వస్తాయని ఆశ చూపి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించారు దంపతులు

చివరకు కటకటాల పాలయ్యారు. ఈ దంపతులకు కోర్టు ఏడాదిరన్న జైలు శిక్ష, జరిమానా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నిజాంపేట నివాసి రూపేష్ కుమార్ గతంలో బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు. రూపేష్ ఉండే ప్రాంతంలోనే అజయ్ హంస సాగర్, గీత అనే భార్య భర్తలు ఉండేవారు. అప్పుడప్పుడు చేబదులు కింద రూ. 5 వేలు, రూ. 10 వేలు తీసుకుని తిరిగి ఇచ్చేసే వారు. 2017లో రూపేష్ బదిలీపై హైదరాబాద్ వచ్చి నిజాం పేటలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అజయ్, గీతాలకు కూడా నగరానికి వచ్చి తార్నాకలో కాపురం ఉంటున్నారు. అయితే రూపేష్‌తో ఉన్న పరిచయాన్ని కొనసాగించారు దంపతులు. షేర్ మార్కట్ లో పెట్టుబడి పెడితే.. లాభాలు ఆర్జించవచ్చునని నమ్మబలికారు.

వారి మాయ మాటలు నమ్మిన రూపేష్.. వారి బ్యాంకు ఖాతాకు రూ. 25 లక్షలు బదిలీ చేశారు. తర్వాత నెలకు రూ. 2 లక్షల లాభం చొప్పున అతడికి ఇచ్చుకుంటూ వచ్చారు. రెండు నెలలు అయ్యాక.. వారు ఆడుతున్నదీ నాటకమని రూపేష్ గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే.. తప్పించుకుని తిరుగుతున్నారు.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ చీటింగ్ కేసు కోర్టుకు వెళ్లింది. బుధవారం విచారణ చేపట్టిన కూకట్ పల్లి 11వ అదనపు ఎంఎం కోర్టు న్యాయమూర్తి టీ మురళీ మోహన్.. ఈ దంపతులకు ఏడాదిన్నర జైలు, జరిమానా విధించారు.

Show comments