తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు, బాణసంచా పేలుడు కారణంగా ఈ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని దారుణంగా గడుపుతున్నారు. ఇక అగ్నిప్రమాదాల కారణంగా భారీ ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. వేల నుంచి కోట్ల వరకు ఆస్తి నష్టం జరుగుతుంది. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ దుకాణంలో జరిగిన బాణసంచా పేలుడు కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
నల్లగొండ జిల్లా మోత్కూరు పట్టణంలోని చెరువు కట్ట వద్ద ప్రధాన రహదారిపై సుగూరు సురేష్ అనే వ్యక్తి జనరల్ స్టోర్ ను నడిపిస్తున్నాడు. రోజు ఉదయాన్ని షాపు వెళ్లి.. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే వాడు. అదే మాదిరి బుధవారం ఉదయం కూడా తన జనరల్ స్టోర్ ను సురేష్ తెరిచారు. లోపల ఎలుకలు కరెంటు తీగలను కోరికి వేయడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి… ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంతేకాక పక్కనే ఉన్న బాణసంచాకు కూడా ఆ మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ మంటలు ఎగిసి పడటంతో భయంతో సురేష్ బయటకు పరుగులు తీశాడు. అనంతరం స్థానిక పోలీసులకు సమచారం అందిచడంతో వారు అక్కడి చేరుకున్నారు. అలానే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు.
అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే సమయానికి .. చాలా వస్తువులు కాలి బుడిదయ్యాయి. దుకాణంలోని స్టేషనరీ, ప్లాస్టిక్ సామాగ్రితో పాటు శీతలీకరణ యంత్రం, బైక్, ర్యాకులు, పుస్తకాలు కాలిపోయాయి. రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని షాపు ఓనర్ అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సకాలంలో మంటలు ఆర్పడంతో పక్కనే ఉన్న ఇళ్లకు పెను ప్రమాదం తప్పింది. దుకాణంలో నిల్వచేసిన బాణసంచా కాలడంతోనే పెద్ద ప్రమాదం జరిగిందని, నివాస స్థలాలు ఉన్న ప్రాంతంలో టపాసుల విక్రయాన్ని నిరోధించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. మరి.. ఇలాంటి ఘటన నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ