Nidhan
ఓ నకిలీ మహిళా ఎస్సై చేసిన నిర్వాకం గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని అనకమానరు. పెళ్లిచూపుల్లో అడ్డంగా దొరికిన ఆ లేడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ నకిలీ మహిళా ఎస్సై చేసిన నిర్వాకం గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని అనకమానరు. పెళ్లిచూపుల్లో అడ్డంగా దొరికిన ఆ లేడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది చాలా మంచి డ్రీమ్. కానీ చాలా తక్కువ మంది దీన్ని నిజం చేసుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి, పట్టుదలతో చదివి డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలంటే అంత ఈజీ కాదు. అయితే కొందరు ఎంత కష్టపడినా విజయానికి ఆఖరి మెట్టు వరకు వచ్చి ఆగిపోవచ్చు. అయితే ఓడినా దాన్ని ఒప్పుకోని వారితో కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాంటి ఓ అమ్మాయి కథే ఇది. ఆమె ఆర్పీఎఫ్ ఎస్సై. ప్రతి రోజూ యూనిఫామ్‌లోనే డ్యూటీకి వెళ్లేది. టెంపుల్స్‌కు కూడా ఇలాగే వెళ్లేది. ఏడాదిగా అందర్నీ నమ్మించిన ఆ యువతి.. ఆఖరికి పెళ్లి చూపులకు కూడా యూనిఫామ్‌లోనే వెళ్లింది. కానీ ఎవరి దగ్గరా ఆమె మోసం బయటపడలేదు. కానీ పెళ్లిచూపుల్లో మాత్రం ఆ నకిలీ మహిళా ఎస్సై లీలలు బయటపడ్డాయి.
నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లికి చెందిన జడల మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. 2018లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్సై ఎగ్జామ్ రాసింది. రాతపరీక్షలో పాసైన మాళవిక.. మెడికల్ టెస్టులో మాత్రం క్వాలిఫై కాలేదు. కంటి సమస్య (మెల్ల కన్ను) ఉండటంతో ఆమెను పక్కనపెట్టారు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పని ఆ యువతి.. తనకు జాబ్ వచ్చిందని అందర్నీ నమ్మించింది. శంకర్‌పల్లిలో ఆర్పీఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పింది. ఇందులో భాగంగానే నకిలీ ఐడీ కార్డు సహా యూనిఫామ్‌ను రెడీ చేసుకుందామె. ప్రతి రోజు పోలీసు యూనిఫామ్ ధరించి డ్యూటీకి వెళ్తున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లొచ్చేది.
పోలీసు యూనిఫామ్‌లోనే పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంది మాళవిక. ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. అయితే ఆ పెళ్లిచూపులకు కూడా మాళవిక యూనిఫామ్‌లోనే అటెండ్ అయింది. తాను ఆర్పీఎఫ్ ఎస్సైను అని వాళ్లకు పరిచయం చేసుకుంది. ఎంత పోలీసైతే మాత్రం పెళ్లి చూపులకు యూనిఫామ్‌లో రావడం ఏంటని అబ్బాయి తరఫు వారికి డౌట్ వచ్చింది. అంతే ఆమె గురించి తెలిసిన వారి దగ్గర, అలాగే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఉన్నతాధికారులను సంప్రదించగా మాళవిక ఎస్సై కాదని తేలిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్సైగా చలామణి అవుతున్న ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం రాదని తెలిస్తే తన పేరెంట్స్ బాధపడతారనే ఉద్దేశంతోనే ఈ పని చేశానని ఎంక్వైరీలో మాళవిక చెప్పుకొచ్చింది. మరి.. ఈ మొత్తం వ్యవహారం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Dinajpur: వీడియో: స్కూల్‌కు వెళ్తున్న బాలికపై యువకుడి పైశాచికం! CCTVలో అంతా రికార్డ్