iDreamPost
android-app
ios-app

సాంబార్ విషయంలో గొడవ.. తండ్రీ, కొడుకులు దారుణం

హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ హోటల్లో బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్.. ఎక్స్ ట్రా పెరుగు అడిగాడని హోటల్ సిబ్బంది దాడి చేసిన ఘటన మర్చిపోక ముందు.. ఇప్పుడు సాంబార్ విషయంలో మరో దారుణం చోటుచేసుకుంది.

హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ హోటల్లో బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్.. ఎక్స్ ట్రా పెరుగు అడిగాడని హోటల్ సిబ్బంది దాడి చేసిన ఘటన మర్చిపోక ముందు.. ఇప్పుడు సాంబార్ విషయంలో మరో దారుణం చోటుచేసుకుంది.

సాంబార్ విషయంలో గొడవ.. తండ్రీ, కొడుకులు దారుణం

ఇంట్లో వంట చేయినా.. వీకెంట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో లంచ్ ఆర్ డిన్నర్ ప్లాన్ చేసుకున్నా ఓ మంచి హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వస్తుంటారు. తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసి.. కడుపారా ఆరగించి.. బిల్లు కట్టేసి వస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో రెస్టారెంట్లలో జరిగిన కొన్ని సంఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ పంజాగుట్టలోని మెరీడియన్ హోటల్ రెస్టారెంట్‌కు తినేందుకు వచ్చిన ఓ కస్టమర్.. పెరుగు ఎక్స్ ట్రా అడిగినందుకు చావ కొట్టారు సిబ్బంది. ఈ ఘటనలో లియాకత్ అనే యువకుడు మరణించాడు. అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్లో మటన్ బిర్యానీ బాగోలేదని చెప్పినందుకు కస్టమర్లపై దాడి చేశారు. కస్టమర్లు కూడా హోటల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టిన ఘటనలు ఉన్నాయి. తాజాగా తనకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వాలని ఓ మందు బాబు హోటల్ యజమానిపై తిరగబడిన ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీలో జరిగింది.

ఇప్పుడు ఎక్స్ ట్రా సాంబార్ కోసం ఒక వ్యక్తి ప్రాణాలే తీశారు కస్టమర్లు. ఈ ఘటన తమిళనాడులోని పల్లవరంలో చోటుచేసుకుంది. సాంబార్ అంటే తమిళనాడు.. తమిళనాడు అంటే సాంబార్ దా అన్న పేరు పడింది. తమిళ తంబీలకు ప్రతి రోజు సాంబార్ లేనిదే ముద్దదిగదన్న అపవాదు ఉంది. అంతలా వారి జీవితాల్లో మమైకం అయిపోయింది సాంబార్. దీని కోసం ప్రాణం ఇచ్చేస్తారు..అవసరమైతే ప్రాణం తీసేస్తారు. ఇదే నిరూపించారు ఆ తండ్రి, కొడుకులు. పల్లవరంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులో అడయార్ ఆనంద భవన్ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వచ్చారు తండ్రి, కొడుకులు శంకర్, అరుణ్ కుమార్. ఇడ్లీ పార్సిల్ చెప్పి.. ఎక్స్ ట్రా సాంబార్ ప్యాక్ వేయాలంటూ కోరారు.

Father and son killed a weighter in hotel

సాంబార్ మరో ప్యాకెట్ వేయలేమని చెప్పేశారు హోటల్ సిబ్బంది. డబ్బులు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వలేరంటూ తండ్రి, కొడుకులు గొడవకు దిగారు. దీంతో కస్టమర్స్, రెస్టారెంట్ సిబ్బంది మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ వాగ్వాదంలో అక్కడితో ముగిసిపోగా.. పార్కింగ్ నుండి త్వరగా బండి తీయాలంటూ సెక్యూరిటీ గార్డు.. చెప్పడంతో శంకర్, అరుణ్ రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టారు. దీన్ని ఆపేందుకు వచ్చాడు హోటల్ సూపర్ వైజర్ అరుణ్. ఇంతలో ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వలేదన్న కోపంతో.. అరుణ్ పై దాడి చేశారు తండ్రి, కొడుకులు. వారు తీవ్రంగా దాడి చేయడంతో సూపర్ వైజర్ స్పృహ కోల్పోయాడు. హోటల్ సిబ్బంది వెంటనే.. క్రోం పేట ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. అందిన ఫిర్యాదుతో వీరిపై పోలీసు కేసు నమోదైంది. ఇద్దర్ని అరెస్టు చేసి.. విచారిస్తున్నారు.