Arjun Suravaram
మంచి అనేక ముసుగు వేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎంతో మంది మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం చేసిన పనికి పోలీసులే షాకయ్యారు.
మంచి అనేక ముసుగు వేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎంతో మంది మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం చేసిన పనికి పోలీసులే షాకయ్యారు.
Arjun Suravaram
సమాజంలో మంచి అనేక ముసుగు వేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీంతో నిజమైన మంచి వారిని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటితే ఎంతో మంది మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు తీసుకుని ఉడాయిస్తున్నారు. ఇలాంటి మోసాలకు కొందరు భార్యాభర్తలు కూడా పాల్పడుతున్నారు. ఇటీవలే 200 కోట్ల స్కామ్ లో ఓ దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కుటుంబం మొత్తం మోసాల దందాకు పాల్పడుతూ పోలీసులకు దొరికారు. ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలను ఈ మాయదారి కుటుంబం కాజేసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ మొల్ల శివయ్య అలియాస్ శివకుమార్, స్వర్ణలత భార్యాభర్తలు. వీరికి జశ్వంత్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక ఈ ముగ్గురు కలిసి మిమాంశ, రియాల్టీ ఔరా, జ్యోతిక ఇన్వెస్టర్స్ క్లబ్ అనే పేర్లతో మోసాల చేయండం ప్రారంభించారు. స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్మెంట్ లు, ఎన్ఎల్పీ ద్వారా మెడికల్ సర్వీస్ అందిస్తామని సామాన్యులను ఆకట్టుకుంటారు. అందుకు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేశారు పెట్టుబడులు, ఎన్‌ఎల్‌పీ ద్వారా వైద్యసేవలు అందిస్తామని.. ఆకట్టుకునేలా మాట్లాడుతూ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేశారు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తాము నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాల్లో యోగా శిక్షణ, జిమ్, ఆయుర్వేదం వంటి సౌకర్యాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ క్రమంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఒక్కో సభ్యుడి నుంచి లక్ష రూపాయాలు తీసుకున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్ తక్కువ కాలంలో తగ్గించేందుకు మిమాంశ వెల్‌నెస్ రిసార్ట్స్ సేవలు అందిస్తున్నట్టు శివయ్య చెప్పే వాడు. ఎలాంటి అర్హత లేకపోయినా తానే డాక్టర్ గా చెలామణి అయ్యాడు. వీరి మాటలు నమ్మి 70 మంది శిక్షణ, స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ పెట్టారు. ఇటీవల బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శివయ్య, స్వర్ణలత, జశ్వంత్, న్యాయవాది శ్రీనివాస్ కలిసి సామాన్యుల నుంచి రూ.10.86కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా సీసీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా నిందితులు జ్యుడిషియల్ రిమాండ్ అనుభవించారు. రిమాండ్ ముగిసిన అనంతరం బయటకు వచ్చాక ప్రధాన నిందితుడు శివయ్య.. మళ్లీ సోషల్ మీడియాలోని పలు ఛానళ్ల ద్వారా ప్రకటనలు చేస్తున్నాడు. వీటిని ఎవరూ గుడ్డిగా నమ్మవద్దని డీసీపీ ఎం.శ్వేత సూచించారు. మొత్తంగా పలుమార్లు కేసులు నమోదై జైలుకెళ్లొచ్చినా విడుదల కాగానే మళ్లీ మోసాలతో విరుచుకుపడుతున్న ఈ మాయదారి కుటుంబం ఆటకట్టించారు నగర సీసీఎస్ పోలీసులు. ఇలాంటి కిలాడీ బ్యాచ్ మన చుట్టూ మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి..జాగ్రత్తగా ఉండాలి.