iDreamPost
android-app
ios-app

యువతిని హింసించిన కేసు.. పరారీలో MLA కుమారుడు, కోడలు!

తమ ఇంట్లో పని చేస్తున్న యువతిని హింసించిన కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, కోడలిపై కేసు నమోదైంది. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే

తమ ఇంట్లో పని చేస్తున్న యువతిని హింసించిన కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, కోడలిపై కేసు నమోదైంది. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే

యువతిని హింసించిన కేసు.. పరారీలో MLA కుమారుడు, కోడలు!

ప్రజలకు సేవ చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అలానే ఎవరైనా తప్పు చేస్తే.. వారిని చట్టానికి అప్పగించే కర్తవ్యం కూడా ప్రజాప్రతినిధులపై  ఉంటుంది. అయితే కొందరు మాత్రం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కుటుంబ సభ్యులు చేసే నేరాలకు చట్టం నుంచి శిక్ష పడకుండా తప్పించే ప్రయత్నం చేస్తుంటారు. అలానే కొందరు అయితే పక్క ఆధారాలు దొరికితే.. పోలీసులకు చిక్కకుండా పారిపోతుంటారు. తాజాగా ఓ ఎమ్మెల్యే కుమారుడు, కోడలు కూడా పరారీలో ఉన్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తమిళనాడు రాష్ట్రంలోని పల్లావరం నుంచి ఎమ్మెల్యేగా కరుణానిధి గెలుపొందాడు. ఇక ఆయనకు ఆండ్రో మదివాణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి కొన్నేళ్ల క్రితం మెర్లినా అనే యువతితో వివాహం జరిగింది. ఇక ఈ ఎమ్మెల్యే కోడుకు, కోడలిపై ఓ కేసు నమోదైంది. ఇంటి పనులు చేసే యువతిని ఆ ఇద్దరు చిత్ర హింసలకు గురి చేసినట్లు కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆ దంపతులు ఇద్దరిని అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు స్పెషల్ టీమ్స్ గా ఏర్పడ్డాయి.  ఆండ్రో మదివాణన్‌, మెర్లినాలు తమ ఇంట్లో పని చేసే యువతిని వేధించినట్లు ఫిర్యాదు రావడంతో నీలాంగరై ఆల్‌ ఉమెన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ దంపతులపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదైనప్పటినుంచి ఆ దంపతులు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసేందుకు మూడు స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏర్పాటయ్యాయి. యువతిని హింసించిన  విషయంలో కేసు నమోదు చేసి ఆరు రోజులైంది. ఈ క్రమంలోనే  ఆ ఇద్దరూ సైదాపేటలోని స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం యత్నిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఎఫ్‌ఐఆర్‌లో పలు కీలక అంశాలను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాఫీని నమోదు చేశారు. ఆ దంపతుల ఇంట్లో పని మనిషిగా ఓ యువతి  చేరింది. వారి ఇంటి పనులు చేస్తున్నా తనను హింసించేవారని, అలానే వారితో పాటు ముంబై వెళ్లినప్పుడు సరిగ్గా వంట చేయలేదని దాడిచేశారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది.  పచ్చి మిరపకాయ తినిపించి హింసించారని, అంతేకాకుండా వాతలు పెట్టి రక్తం కారేలా కొట్టేవారని ఎఫ్ఐఆర్ లో నమోదైంది. ఇక ఆ యువతి మూడేళ్లు అక్కడే ఉండి పనిచేయాలంటూ సంతకం చేయించుకున్నారని, బయటకు వెళ్తే ఆమె తల్లిని ఏమైనా చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు.

ఇంక దారుణం ఏమిటంటే…కులంపేరుతో తరచూ దాడి చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తమను అరెస్టు చేస్తారనే భయంతో  సదరు ఎమ్మెల్యే కుమారుడు, కోడలు పరారైనట్లు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణలోని హైదరాబాద్ లో ఓ ఎమ్మెల్యే కుమారుడి కారు రోడ్డు ప్రమాదం చేసిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు  జరుగుతోంది. ఇలా కొందరి ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు నేరాలకు పాల్పడి..చట్టం నుంచి తప్పించుకునేందు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.