Uppula Naresh
Uppula Naresh
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ ఎస్ఓఎస్ యాప్ ప్రజలకు వరంగా మారింది. ఈ యాప్ గురించి ప్రజల్లో అవగాహన రావడంతో ప్రజలు ఎలాంటి ఆపధ సమయాల్లో ఉన్నా.. వెంటనే దిశ పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. దీంతో పోలీసులు క్షణాల్లో స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలుస్తున్నారు. అచ్చం ఇలాగే దిశ పోలీసులు ఓ 10వ తరగతి విద్యార్థినికి అండగా నిలిచి ఆదుకున్నారు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన సైన్స్ టీచర్ ను అరెస్ట్ చేసి మేమున్నామంటూ ధైర్యాన్ని నింపారు. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా వంగర ప్రభుత్వ పాఠశాలలో రాములు అనే వ్యక్తి సైన్స్ టీచర్ గా విధులు నిర్వస్తున్నారు. అయితే ఇదే స్కూల్ లో ఓ బాలిక 10వ తరగతి చదువుతుంది. ఇదిలా ఉంటే.. ఆ బాలికపై టీచర్ రాములు కన్నేశాడు. ఆ విద్యార్తినితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆ విద్యార్థిని ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో వెంటనే ఆ విద్యార్థినిని దిశ పోలీసులకు సమాచారం అందించింది. ఆ పోలీసులు క్షణాల్లో బాధితురాలి ఇంటికి చేరుకుని జరిగిందంతా తెలుసుకున్నారు.
ఆ తర్వాత దిశ పోలీసులు నిందితుడు సైన్స్ టీచర్ రాములును అదుపులోకి తీసుకుని అతని సెల్ ఫోన్ లో ఉన్న ఆ బాలిక ఫోటోలను చూసి షాక్ గురయ్యారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడు రాములుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా మహిళల పట్ల ఎవరు పాడు పనులకు తెర లేపినా వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఫిర్యాదు చేసిన వెంటనే దిశ పోలీసులు స్పందించడంతో ఆ బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: విషాదం: చదువు ఇష్టం లేక గోదావరి నదిలో దూకిన ఇంటర్ విద్యార్థి!