iDreamPost
android-app
ios-app

వీడియో: సమోసాలో బంగాళదుంపకు బుదులుగా చచ్చిన బల్లి! 

సమోసాలో కనిపించిన చనిపోయిన బల్లి. అవును, మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

సమోసాలో కనిపించిన చనిపోయిన బల్లి. అవును, మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

వీడియో: సమోసాలో బంగాళదుంపకు బుదులుగా చచ్చిన బల్లి! 

సమోసా అంటే ఇష్టం ఉండని వ్యక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్దవాళ్ల వరకు.. అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే.. వర్షకాలంలో వేడి వేడి సమోసా.. అందులోకి నంజు కోవడానికి పక్కన వేయించిన పచ్చి మిర్చిని కలిపి తింటుంటే అబ్బా.. ఆ టెస్ట్ వేరే లెవల్ అని చెప్పక తప్పదు. ఇలా ఎంతో ఇష్టంతో ఓ వ్యక్తి ఇటీవల ఓ హోటల్ లో వేడి వేడి సమోసా ఆర్డర్ ఇచ్చాడు. హోటల్ సిబ్బంది వెంటనే తీసుకొచ్చి ఆ వ్యక్తికి సమోసా ఇచ్చాడు. అలా రెండు మూడు సార్లు ఆ సమోసాను కర కర నమిలాడు. కానీ, అందులో బంగాళదుంపకు బదులుగా చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. ఇది చూసిన ఆ వ్యక్తి వెంటనే వాంతులు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని హపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఓ హోటల్ కు వెళ్లి వేడి వేడి సమోసా ఆర్డర్ ఇచ్చాడు. దీంతో హోటల్ సిబ్బంది వెంటనే అతడికి వేడి వేడి సమోసా తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి ఇచ్చాడు. దీంతో అతడు తొందర తొందరలో ఆ సమోసాను రెండు సార్లు కరకర నమిలి తిన్నాడు. కానీ, టెస్ట్ విషయంలో ఆ యువకుడికి ఏదో తేడా కొట్టింది. వెంటనే ఆ సమోసాలో చూడగా.. బంగాళదుంపకు బదులుగా చచ్చిపోయిన బల్లి దర్శనమిచ్చింది. దీన్ని చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొందరు వ్యక్తులు ఆ దుకాణ దారుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. కొందరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలాంటివి వెలుగు చూస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి దుకాణాలను మూసివేయాలని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సమోసాలో బంగాళ దుంపకు బదులుగా చచ్చిన బల్లి వచ్చిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.