విమానాశ్రయంలో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణీకుడు! ఎక్కడంటే?

కస్టమ్స్ అధికారులకే చుక్కలు చూపించాడు ఓ కస్టమర్. చాలా హుందాగా సూట్ కేసుతో విమానాశ్రయంలోకి అడుగుపెట్టాడు. అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అతడి సూట్ కేస్ చెక్ చేస్తుంటే..

కస్టమ్స్ అధికారులకే చుక్కలు చూపించాడు ఓ కస్టమర్. చాలా హుందాగా సూట్ కేసుతో విమానాశ్రయంలోకి అడుగుపెట్టాడు. అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అతడి సూట్ కేస్ చెక్ చేస్తుంటే..

విమానాశ్రయంలో ప్రతి ప్రయాణీకుని లగేజ్ తనిఖీలు చేపడతారు కస్టమ్స్ అధికారులు. ఈ సమయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం లేదా స్మగుల్డ్ గూడ్స్, మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో తీసుకెళుతుంటారు ట్రావెలర్స్. కానీ కస్టమ్స్ అధికారుల కళ్లల్లో పడితే.. జైలు జీవితమే. భారీగా బంగారం, డబ్బు, డ్రగ్స్ పట్టుకున్న కేసులను చూశారు. కానీ ఇటీవల జంతువులను కూడా అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో 72 పాములు, ఆరు కోతులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు బెంగళూరు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుండి వచ్చిన విదేశీ పర్యాటకుడి బ్యాగులో నుండి వీటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో 55 కొండ చిలువలు, 17 కింగ్ కోబ్రాలు ఉన్న సంగతి విదితమే. తాజాగా మరో సంఘటన వెలుగు చూసింది.

విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ప్యాసింజర్ల బ్యాగులు చెక్ చేస్తున్నారు. అంతలో విదేశాల నుండి వచ్చిన ఓ ప్రయాణీకుడి లగేజీని సెర్చ్ చేస్తుండగా.. విస్తుపోయే సంఘటన వెలుగు చూసింది. బ్యాంకాక్ నుండి వచ్చిన ఓ ప్రయాణీకుడు బ్యాగ్ తనిఖీ చేస్తుండగా.. 10 అనకొండలను గుర్తించారు. వాటిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. 10 ఎల్లో అనకొండలు చూసి కస్టమ్స్ అధికారులే విస్తుపోయారు. ఇతడు కూడా బ్యాంకాక్ నుండి రావడం గమనార్హం.

బ్యాంకాక్ నుండి వచ్చిన ఓ ప్రయాణీకుడి సూట్ కేస్ తనిఖీలు చేపట్టారు కస్టమ్స్ ఆఫీసర్లు. ఆ బ్యాగులో తెల్ల కవర్లు కనిపించాయి. వాటి నుండి వింత శబ్దాలు రావడంతో కవర్లు కదులుతుండటంతో వెంటనే అనుమానం వచ్చి.. విప్పి చూడగా.. పెద్ద పెద్ద అనకొండలు బయట పడ్డాయి. అలా సుమారు 10 అనకొండలను బయటకు తీశారు. వీటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే విదేశీ ప్రయాణీకుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ.. వన్య ప్రాణుల అక్రమ రవాణాను సహించబోమని పేర్కొన్నారు. భారతీయ చట్టాల ప్రకారం.. వన్య ప్రాణాలతో వ్యాపారం చేయడం చట్ట విరుద్ధం.  కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం.. ఎవరైనా వన్యప్రాణులతో వ్యాపారం చేస్తే పలు శిక్షలు ఉన్నాయి.  కానీ ఇప్పుడు దీన్నే వ్యాపారంగా మలుచుకున్నారు కొందరు.

Show comments