Krishna Kowshik
ఇద్దరు ఆడవాళ్లు ఓ చోట ఉంటే యుద్దమే జరుగుతుందని ఓ వాదన ఉంది. వాళ్లు.. అత్తా కోడళ్లు అయితే.. మాటలతోనే తూటాలు పేల్చుకుంటూ ఉంటారు. ఇదిగో ఇవే సమస్యలు ఇంట్లో మగవాళ్లకి తలనొప్పులు తెస్తున్నాయి.
ఇద్దరు ఆడవాళ్లు ఓ చోట ఉంటే యుద్దమే జరుగుతుందని ఓ వాదన ఉంది. వాళ్లు.. అత్తా కోడళ్లు అయితే.. మాటలతోనే తూటాలు పేల్చుకుంటూ ఉంటారు. ఇదిగో ఇవే సమస్యలు ఇంట్లో మగవాళ్లకి తలనొప్పులు తెస్తున్నాయి.
Krishna Kowshik
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనేది సామెత.. అలాగే ఓ ఇంట్లో రెండు కొప్పులను కూడా భరించలేము అనే నానుడి కూడా ఉంది. వాళ్లే అత్తా కోడళ్లు. అందుకే అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామెత వచ్చింది. పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్ర పోయే వరకు ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ ఇల్లును నరకం చేయడమే కాకుండా..మగవాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు. పనుల మీద బయటకు వెళ్లి వచ్చిన కొడుక్కి కోడలిపై చాడీలు చెబుతూనే ఉంటుంది. అలాగే అత్తపై కూడా భర్త లేనిపోనివి ఎక్కేస్తుంటుంది భార్య. ఇద్దరికీ సర్ది చెప్పలేక ఆ ఇంట్లో మగవాళ్లు పడే యాతన అంతా ఇంతా కాదు. ఈ గొడవలే అత్తా కోడళ్ల హత్యలకు కారణమయ్యాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని భాగ్ పత్ జిల్లాలోని బరౌత్‌లోని హలాల్ పూర్ గ్రామంలో నివసిస్తోంది జితేంద్ర కుటుంబం. జితేంద్ర రిటైర్డ్ పోలీస్ ఇన్ స్పెక్టర్. అతడికి ఇద్దరు కుమారులు. ధీరజ్ ఢిల్లీలో అగ్ని మాపక దళంలో పని చేస్తున్నాడు. జితేంద్ర రిటైర్డ్ అయ్యాక భార్య సరోజ, మరో కొడుకు మనీష్, కోడలు వర్షతో యుపిలో జీవిస్తున్నాడు. ఓ రోజు అత్తా కోడళ్లు సరోజ, వర్షలు హత్యకు గురయ్యారు. ఇద్దర్ని హత్య చేసి చంపాడు మనీష్. తల్లిని, భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే. మనీష్.. వర్షకు 2022లో వివాహం అయ్యింది. పెళ్లయిన కొద్ది రోజుల నుండి ఇంట్లో గొడవలు జరిగేవి. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య. ఆలస్యంగా నిద్రలేచిన, వంట విషయంలోనూ ఇద్దరూ గొడవలు పడుతుండేవారు.
మనీష్‌తో ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకునే వారు సరోజ, వర్షలు. నిత్యం ఇదే సమస్య. దీంతో విసుగు చెందిన మనీష్.. మంగళవారం తండ్రి జితేంద్ర ఫించను నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సమయంలో.. ఆ రోజు మధ్యాహ్నం కూరగాయలు కోసే కత్తి తీసుకని టెర్రస్ పై ఉన్న తమ గదిలోకి వెళ్లాడు. అక్కడ భార్యతో.. క్షమించు అని కోరుతూ… మెడపై కత్తితో కోశాడు. అనంతరం అతడు తల్లి నిద్రిస్తున్న గదిలోకి వచ్చి.. ఆమెను కూడా గొంతు కోసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకూడదని హత్య చేసిన తర్వాత.. రక్తం మరకలు పడిన బట్టలు, కత్తిని పాలిథిన్ సంచిలో ఉంచి ఊరి బయట కాలువలో పడేసి.. తెలియనట్లుగా తన పనికి వెళ్లిపోయాడు.
కాగా, పొరిగింట్లో ఉన్న గీత అనే మహిళ సరోజను పిలించేందుకు వాళ్ల ఇంటికి వెళ్లింది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న సరోజ, వర్షలను చూసి భయంతో మనీష్‌కు కాల్ చేసి తర్వగా రావాలని కోరింది. ఇంటికి వచ్చి చూసే సరికి రక్తపు మడుగుల్లో పడి ఉన్న తల్లి, భార్యను చూసి ఘొల్లుమన్నాడు మనీష్. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం బయటకు వచ్చింది. అత్తా, కోడళ్లు నిత్యం గొడవ పడుతుండటంతోనే హత్య చేసినట్లు మనీష్ అంగీకరించాడు.