iDreamPost
android-app
ios-app

మూడున్నరేళ్ల క్రితం మిస్‌.. ఇన్నాళ్ల తర్వాత యువతికి

ఆ ఇంట్లో ఒక్కర్తే అమ్మాయి. గారాబంగా పెంచుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఓ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా కుటుంబ సభ్యులకు కనిపించలేదు. కానీ అనూహ్యంగా కొన్ని రోజుల తర్వాత గ్రామంలోని ఓ పొలంలో..

ఆ ఇంట్లో ఒక్కర్తే అమ్మాయి. గారాబంగా పెంచుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఓ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా కుటుంబ సభ్యులకు కనిపించలేదు. కానీ అనూహ్యంగా కొన్ని రోజుల తర్వాత గ్రామంలోని ఓ పొలంలో..

మూడున్నరేళ్ల క్రితం మిస్‌.. ఇన్నాళ్ల తర్వాత యువతికి

రీటా వయస్సు 19 ఏళ్లు. మూడేళ్ల క్రితం హఠాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ను అడిగారు. ఎవ్వరూ మేం చూడలేదంటే.. మాకు తెలియదంటూ సమాధానం చెప్పడంతో.. చివరకు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆమెను 8 రోజుల తర్వాత గ్రామంలోని పొలంలో కాలిపోయిన స్థితిలో గుర్తించారు. కానీ ఆమె మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. చివరకు యువతి చనిపోయిన్న మూడున్నరేళ్ల తర్వాత ఆమె మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇంతకు ఏం జరిగిందంటే.

ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని జస్వంత్ నగర్ ప్రాంతంలోని చక్ సలేంపూర్ అనే గ్రామం ఉంది. 2020 సెప్టెంబర్ 19న రీటా అనే అమ్మాయి ఉన్నపళంగా కనిపించకుండా పోయింది. ఆమె వెతకడం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. రీటా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు టేకప్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె కనిపించకుండా పోయిన 8 రోజుల తర్వాత రీటా మృతదేహాన్ని ఆమె గ్రామంలోని పొలంలో కాలిన స్థితిలో గుర్తించారు పోలీసులు. ముఖం బాగా కాలిపోయి.. గుర్తించని స్థితిలో కనిపించింది. సగం అస్థిపంజరంగా మారిపోయింది. అయితే చెప్పులు, ఉంగరం, మరికొన్ని వస్తువులను బట్టి ఆ యువతిని రీటాగా గుర్తించారు కుటుంబ సభ్యులు. అయితే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేందుకు నిరాకరించారు పోలీసులు.

దర్యాప్తు చేయాలంటూ పోలీసులు పట్టుబట్టడంతో ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. చివరికి మృతదేహానికి డీఎన్ఎ నిర్వహించి.. కానీ స్పష్టమైన నివేదిక రాలేదు. అయితే ఆమె మృతదేహాన్ని అప్పగించాలంటూ అధికారులను ప్రశ్నించడం మొదలు పెట్టారు రీటా కుటుంబ సభ్యులు. అయినప్పటికీ అప్పగించలేదు. మళ్లీ డీఎన్ఎ పరీక్ష చేశారు. మళ్లీ రిపోర్టులో లోపం కనిపించింది. ఈ మర్డర్ మిస్టరీ పోలీసులను కూడా ఆశ్చర్య పరిచేలా చేసింది. ఈ కేసు చేధించాలన్న ఉద్దేశంతో ఆమె మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్‌లో ఉంచారు. అలా ఈ కేసు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఆమె మృతదేహాన్ని అప్పగించాలని తల్లిదండ్రులు పట్టుబడటంతో… ఈ కేసు దర్యాప్తును మరో అధికారికి అప్పగించారు.

మూడోసారి డెడ్ బాడీకి డీఎన్ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మూడోసారి స్పష్టమైన నివేదిక వచ్చింది. ఆమెను హత్య చేసి.. కాల్చినట్లు తేలింది. చివరకు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మేజిస్ట్రేట్, అధికారుల పర్యవేక్షణలో గత నెల 31న చక్ సలేంపూర్‌లోని వారి పొలంలో రీటా మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేశారు కుటుంబ సభ్యులు. రీటా తల్లి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదు. అయితే తమకు న్యాయం చేయాలని రీటా సోదరులు డిమాండ్ చేస్తున్నారు. తన కూతురు రీటాను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ కేసులో నిందితులకు పోలీసులు సాయం చేశారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.