iDreamPost
android-app
ios-app

ఆంటీపై మనస్సు పడ్డ కుర్రాడు.. పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తే..

అతడో కోటీశ్వరుడు.. ఆంటీపై మనసు పడ్డాడు. భర్త లేకపోవడంతో పాటు ముగ్గురు పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న ఆమెపై ప్రేమ పొంగిపోయింది అతడికి. పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తే..

అతడో కోటీశ్వరుడు.. ఆంటీపై మనసు పడ్డాడు. భర్త లేకపోవడంతో పాటు ముగ్గురు పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న ఆమెపై ప్రేమ పొంగిపోయింది అతడికి. పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తే..

ఆంటీపై మనస్సు పడ్డ కుర్రాడు.. పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తే..

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా తయారయ్యింది ఈ సమాజం. మనిషి పుట్టుక నుండి చావు వరకు నడిపిస్తున్న ఇంధనం కావడంతో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీంతో విలువలు, రక్త సంబంధాలు, నైతికత పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక కడుపున పుట్టిన బిడ్డల మధ్య ఇదే చిచ్చు పెడుతోంది. ఆస్థి, అంతస్థుల పంపకాల విషయంలో తగాదాలు.. అమ్మ నగలు కోసం కోట్లాటలు జరుగుతున్నాయి. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు బంధాల మధ్య చిచ్చు పెడుతోంది డబ్బు. అప్పటి వరకు నువ్వు లేక నేను విడిచి ఉండలేనని పెన వేసుకు పోయిన బంధం.. పెళ్లయ్యాక కుట్రలు, కుంత్రాలతో కలుషితమౌతుంది.

ఈ అక్కా, తమ్ముళ్లు కూడా ఎంతో అన్యోన్యంగా మెలిగేవారు. కానీ తమ్ముడు ఓ పెళ్లైన మహిళను ఇష్ట పడటం.. ఆమెను మనువాడి.. వారి పిల్లలను చూసుకోవడాన్ని భరించలేకపోయిన సోదరి.. వదినను మట్టుపెట్టింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లాలోని ఒట్ట పిడారం నయంబత్తూరుకు చెందిన జయపాల్, కాళియమ్మల్ భార్యా భర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. కాగా, ఐదేళ్ల క్రితం జయపాల్ ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో అప్పటి నుండి ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న తనకన్నా పదేళ్లు చిన్నవాడైన రామచంద్రన్‌తో కాళియమ్మల్ కు పరిచయం ఏర్పడింది. స్థానికంగా రామచంద్రన్ పలుకుబడి ఉండటంతో పాటు ధనవంతుడు కూడా. రామచంద్రన్, కాళియమ్మల్ మధ్య పరిచయం, ప్రేమగా మారింది. భర్త లేని ఆమెకు అండగా నిలవాలనుకున్న అతడు.. ఆమెను వివాహం చేసుకున్నాడు.

 

ఆమెకు ఇది రెండవ మ్యారేజ్ కాగా, అతడికి తొలి వివాహం. అయితే ఈ వివాహాన్ని రామచంద్రన్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంతలో కాళియమ్మాల్ శవమై కనిపించింది. ఆమె ఇంటి వెనుక.. గొంతు నులిమి చంపేశారు. ఇరుగు పొరుగు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఉన్న కెమెరాలను పరిశీలించగా.. మృతురాలి నివాస ప్రాంతంలో వ్లాతికుళమ్ గ్రామానికి చెందిన జయబాలన్ అనే వ్యక్తి సంచరించడం గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామచంద్రన్ తండ్రి కోయంబత్తూరులో పెద్ద ఇనుప దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి.

A boy married aunty

రామచంద్రన్‌కి విజయలక్ష్మి అనే సోదరి కూడా ఉంది. తన కన్నా వయస్సులో 10 ఏళ్ల పెద్దదాన్ని సోదరుడు పెళ్లి చేసుకోవడం, మొదటి భర్తకు పుట్టిన పిల్లలను చూసుకోవడం ఆమెకు నచ్చలేదు. అలాగే సోదరుడు ఆమెను వివాహం చేసుకున్నాడు కాబట్టి.. ఆస్థిలో వాటా వెళుతుందన్న ఆలోచన చేసింది. ఈ విషయంలో ఆందోళన, కోపంతో ఊగిపోయిన విజయ ఆమెను చంపాలని ప్లాన్ చేసింది. తనకు పరిచయం ఉన్న జయబాలన్, స్నేహితులు కవిత, వివేక్, కళా చెల్వన్‌తో కలిసి కుట్ర పన్నింది. హత్య చేసేందుకు అడ్వాన్సుగా రూ. 70వేలు ఇచ్చింది. కాళియమ్మాళ్‌కు కుక్కలంటే ఇష్టమని తెలిసి.. జయబాలన్ కుక్కలకు ఇంజక్షన్స్ వేసేందుకు వచ్చానని చెప్పి ఆమె ఇంట్లో దూరాడు. కుక్కలను ఇంజక్షన్స్ వేయించేందుకు సిద్ధమౌతున్న ఆమెను.. తాడును గొంతుకు బిగించి.. చనిపోయాక అక్కడి నుండి పారిపోయాడు. జయబాలన్ ఇచ్చిన స్టేట్ మెంట్‌తో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.