iDreamPost
android-app
ios-app

భర్తని చంపిన మహిళా హోం గార్డ్! ఎందుకు తెగించింది అంటే?

భార్య హోం గార్డు. విధులు నిర్వర్తించుకుని ఇంటికి వచ్చే సరికి ప్రతి రోజూ భర్తతో తలనొప్పి. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. భర్తకు ఆమె పలుమార్లు ఆ విషయంలో నచ్చజెప్పింది.

భార్య హోం గార్డు. విధులు నిర్వర్తించుకుని ఇంటికి వచ్చే సరికి ప్రతి రోజూ భర్తతో తలనొప్పి. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. భర్తకు ఆమె పలుమార్లు ఆ విషయంలో నచ్చజెప్పింది.

భర్తని చంపిన మహిళా హోం గార్డ్! ఎందుకు తెగించింది అంటే?

భార్య, భర్తల చిన్న చిన్న గొడవలు.. చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. కాపురాన్ని రెండు ముక్కలు అయ్యేలా ఒకరినొకరు దూషించుకోవడం, చేయి చేసుకోవడం చేస్తున్నారు. అయితే కొంత మంది ఇవన్నీ మర్చిపోయి తిరిగి మళ్లీ మునుపటిలాగానే హాయిగా సంసారం చేసుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది వైఫ్ అండ్ హస్బెండ్.. పదే పదే పాత విషయాలను తలచుకుని, తవ్వుకుని మానసికంగా, శారీరకంగా బాధపెట్టుకుంటూ ఉంటారు. ఇదే ఆవేశం అనార్థాలకు, అపార్థాలకు తావునిస్తుంది. పచ్చ సంసారాన్ని తమ చేతులతో తామే కాలరాసుకుంటున్నారు. తాజాగా భర్త అలవాట్లకు లోను కావడంతో పలుమార్లు నయాన్నో, భయాన్నో నచ్చ చెప్పింది. కానీ అతడిలో మార్పు రాలేదు.

దీంతో విసిగిపోయింది.. తాగొచ్చి భర్త గొడవ పడుతుండటంతో తట్టుకోలేక ఒక్కసారిగా కత్తితో పొడిచింది. వెంటనే భర్తను ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పూంతమల్లి పక్కన ఉన్న నసరత్‌పేట యమునా నగర్ 2వ వీధిలో నివసిస్తున్నారు శ్రీనివాసన్, మంగలక్ష్మీ అనే భార్య భర్తలు. భర్త శ్రీనివాస్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. భార్య పూంతమల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తుంది. వీరికి దశ్వంత్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమె హోంగార్డు అయినప్పటికీ.. భర్తను మాత్రం దారిలో పెట్టలేకపోయింది.

భర్త శ్రీనివాసన్ మద్యానికి బానిస అయ్యాడు. ప్రతి రోజు వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఆమె ఎంత నచ్చచెప్పినా అతడు వినిపించుకోలేదు. ఇటీవల తాగి ఇంటికి రావొద్దు అంటూ హెచ్చరించింది. అయినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. ఎప్పటిలాగానే ఇంటికి వచ్చి భార్యతో మరోసారి తగాదా పెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన మంగళలక్ష్మి ఇంట్లో ఉన్న కత్తితో భర్త కడుపులో పొడిచింది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న నసరత్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసన్‌ను రక్షించి కిల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మంగళ లక్ష్మిని నసరత్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి