Krishna Kowshik
తల్లిదండ్రులు.. తమ ఆస్థి పాస్తులుగా తమ పిల్లల్ని భావిస్తుంటారు. అలాంటి పిల్లలే తమ కళ్ల ముందే గొడవలు పడుతుంటే.. వారి బాధ వర్ణనాతీతం. తాజాగా ఈ తరహా
తల్లిదండ్రులు.. తమ ఆస్థి పాస్తులుగా తమ పిల్లల్ని భావిస్తుంటారు. అలాంటి పిల్లలే తమ కళ్ల ముందే గొడవలు పడుతుంటే.. వారి బాధ వర్ణనాతీతం. తాజాగా ఈ తరహా
Krishna Kowshik
ఒకే ఒక్క చిన్న విషయం ఇంత పెద్ద సమస్యను తెచ్చిపెడుతుందా అంటే హాస్యాస్పదంగా అనిపించొచ్చు.. కానీ కొన్ని సంఘటనలు చూస్తుంటే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చుట్టాలు, బంధువులతో కాదూ…కుటుంబ సభ్యుల మధ్యే చిచ్చు రేగుతోంది. ఎంతటి బంధాన్నైనా బలహీనంగా మార్చగలనని నిరూపిస్తుంది ధనం. ధనమేరా అన్నింటికి మూలం అన్న వ్యాఖ్యలను అక్షర సత్యాలుగా మారుస్తుంది ఈ ఇంధనం. రూ. 5 కోసం కూడా అరవింద సమేత మూవీలో ఫ్యాక్షన్ గొడవే జరుగుతుంది. లక్షల కోసం కాదూ.. చిల్లర రూపాయల కోసమే ప్రాణాలు తీసిన ఘటనలున్నాయి. ఇప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య తగాదాను తెచ్చిపెట్టడమే కాదూ.. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది.
కేవలం రూ. 10 ఓ ఇంట్లో విషాదం నింపింది. పది రూపాయలు లేవని చెల్లి చెప్పిందని.. కసురుకున్నాడు సోదరుడు. దీంతో మహిళ తీవ్ర నిర్ణయం తీసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై సమీపాన ఉన్న పాత పల్లవరంలోని సారా నగర్ అనే ప్రాంతంలో కుమరన్- సరస్వతి దంపతులు జీవిస్తున్నారు. వీరికి విట్టల్, మలర్విజి అనే కొడుకు, కూతురు ఉన్నారు. కాగా, మలర్విజ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. పూంతమల్లిలోని ఓ ఐటి కంపెనీలో వర్క్ చేస్తోంది. కాగా, సోదరుడు విట్టల్ తన ఖర్చుల కోసం పది రూపాయలు సోదరి మలర్విజిని అడిగాడు.
అయితే తన వద్ద చిల్లర డబ్బులు లేవని అన్నయ్యకు చెప్పింది చెల్లెలు. రూ. 10 కోసం అన్నా చెల్లెళ్ల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు వాగ్వాదానికి పాల్పడ్డారు. అయితే కోపంలో సోదరుడు ‘ఇక నేను నీతో మాట్లాడను’ అంటూ సీరియస్‌గా చెప్పి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మలర్విజి.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటనపై పల్లవరం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది రూపాయల విషయంలో సోదరి తీసుకున్న ఈ దారుణ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.