iDreamPost

అమ్మ, నాన్న ఇద్దరూ IAS ఆఫీసర్స్! కానీ.., కూతురు ఇలా చేసింది అంటే నమ్మలేరు!

పిల్లల్ని కంటాం కానీ వారి రాతల్ని కనలేమని పెద్దలు చెబుతుంటారు. నిజమే.. తమ ఆశలను, ఆశయాలను పిల్లల మీదకు రుద్దడంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు.. చివరకు

పిల్లల్ని కంటాం కానీ వారి రాతల్ని కనలేమని పెద్దలు చెబుతుంటారు. నిజమే.. తమ ఆశలను, ఆశయాలను పిల్లల మీదకు రుద్దడంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు.. చివరకు

అమ్మ, నాన్న ఇద్దరూ  IAS ఆఫీసర్స్! కానీ.., కూతురు ఇలా చేసింది అంటే నమ్మలేరు!

ఇటీవల పిల్లల్లో మానసిక స్థైర్యం సన్నగిల్లుతుంది. చిన్న విషయానికే.. తీవ్రమైన ఆలోచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు తిట్టారని, కొట్టారని, మార్కులు సరిగా రాలేదని, ప్రేమించిన ప్రియుడు, ప్రియురాలు.. తన ప్రపోజల్‌కు అంగీకరించలేదన్న ఉద్దేశంతో మానసికంగా కుంగిపోయి.. ఆత్మనూన్యత భావానికి గురౌతున్నారు. దీంతో బ్రతకాలన్న ఆశలను సమాధి చేసుకుంటున్నారు. తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయి చివరకు దేనిపై ఆసక్తి చూపరు. చివరకు చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది సామాన్యుల ఇళ్లల్లో మాత్రమే కాదు.. సెలబిట్రీలు, బ్యూరోక్రాట్ల నివాసాల్లోనూ ఇదే జరుగుతుంది. తాజాగా ఓ ఐఏఎస్ అధికారుల కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.

మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు రాధిక, వికాస్ రస్తోగిల కుమార్తె లిపి రస్తోగి ఆత్మహత్య చేసుకుంది. ముంబయిలోని ఎత్తైన భవనం నుండి దూకింది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. రాష్ట్ర సచివాలయం సమీపంలో ఉన్న ఓ భవనంలోని 10వ అంతస్థు నుండి సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు ఆమె బిల్డింగ్ పై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా, ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది. లిపి హర్యానాలోని సోనెపట్‌లో న్యాయ శాస్త్రం చదువుతోంది. ప్రాథమిక విచారణలో చదువుల ఒత్తిడి వల్లే చనిపోయినట్లు నిర్దారించారు.

ఇటీవల పరీక్షల విషయంలో ఆమె కాస్త ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆమె బిల్డింగ్ 10వ అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించారు. బాధితురాలి తండ్రి వికాశ్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌ అధికారులైన మిలింద్‌, మనీషా మహీస్కర్‌ కుమారుడు కూడా ఇదే తరహాలో మృతి చెందాదు. ముంబై ఎత్తైన భవనంపై నుంచి 18 ఏళ్ల కొడుకును కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. లిపి మరణంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అమ్మ, నాన్న ఇద్దరూ IAS ఆఫీసర్స్,  కానీ.., కూతురు ఇలా చేసింది అంటే నమ్మలేరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి