డాక్టర్ అయ్యిండీ ఏంటో ఈ పని.. భర్తను, పిల్లల్ని వదిలేసి

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ప్రాణాలు తీసేసుకుంటున్నారు ప్రజలు. సామాన్యులే కాదు.. బాగా చదువుకుని ఉన్నత స్థితిలో ఉంటున్న వ్యక్తులు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ప్రాణాలు తీసేసుకుంటున్నారు ప్రజలు. సామాన్యులే కాదు.. బాగా చదువుకుని ఉన్నత స్థితిలో ఉంటున్న వ్యక్తులు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా

సమస్య ఎంత పెద్దది అయినా.. సొల్యూషన్ ఉంటుంది. అంతేకానీ ప్రతి ప్రాబ్లమ్‌కు ఆత్మహత్య పరిష్కారం కాదని చాలా మంది అంటుంటారు. మరికొంత మంది వాదన మరోలా ఉంటుంది..ఆ సిచ్చుయేషన్ ఎదురైతే అలాగే ఆలోచన చేస్తుంటారని చెబుతుంటారు. ఏదీ ఏమైనప్పటికీ.. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలని చాలా మంది సూచిస్తుంటారు. అయితే ఆచరణ విషయానికి వస్తే చాలా భిన్నమైన పరిస్థితి నెలకొంది. సామాన్యులే కాదు.. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతో మంది కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి.. చివరకు ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. తాజాగా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళంలో చోటుచేసుకుంది.

కొచ్చిలోని కక్కనాడులోని ఓ ఫ్లాట్‍లో డెంటల్ డాక్టర్ బిందు చెరియన్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురంలోని ఎర్నాకులంలో బిందు దంత వైద్యురాలిగా వర్క్ చేస్తుంది. ఆమెకు భర్త పిల్లలు ఉన్నారు. అయితే వీరి కోజికోడ్‌లో నివాసముంటున్నారు. ఆమె వృత్తి రీత్యా కొచ్చిలో ఉంటోంది. అయితే ఇటీవల ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌లో నుండి బయటకు రాకపోవడంతో స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇంటికి వచ్చి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది బిందు. మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ లభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె చనిపోయినట్లు అందులో పేర్కొనబడి ఉంది. కాగా, బిందు మరణించిన విషయాన్ని కుటంబ సభ్యులకు చేరవేశారు పోలీసులు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులా లేక ఇతర కోణాలున్నాయా అనే విషయంపై కూడా విచారణ చేపడుతున్నారు. అయితే డాక్టర్ చదివి.. దంత వైద్యురాలిగా రాణిస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. వైద్యురాలిగా ఎంతో మంది సేవలిందించే మహిళ.. ఇలా చేయడమేమిటని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే బిందు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. తల్లి కోసం పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష నిర్వహించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వస్థలం తీసుకెళ్లి అంత్యక్రియలు చేసినట్లు తెలుస్తుంది.

Show comments