iDreamPost
android-app
ios-app

కేరళలో మరో దారుణం! అర్ధరాత్రి ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి!

రోజులానే ఆ రోజు కూడా విధులకు హాజరైంది యువతి. వర్షం పడుతుండటంతో మెల్లిగా తన స్కూటీపై ఇంటికి బయలు దేరింది. మార్గమధ్యంలో వెనుక నుండి మరో బండి ఆమెను ఫాలో అవుతుంది.

రోజులానే ఆ రోజు కూడా విధులకు హాజరైంది యువతి. వర్షం పడుతుండటంతో మెల్లిగా తన స్కూటీపై ఇంటికి బయలు దేరింది. మార్గమధ్యంలో వెనుక నుండి మరో బండి ఆమెను ఫాలో అవుతుంది.

కేరళలో మరో దారుణం! అర్ధరాత్రి ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి!

ఈ మధ్య కాలంలో దొంగతనాలకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు చోరులు. మొన్నటి వరకు ఇంటికో, గుడికో కన్నం వేసేవారు కేటుగాళ్లు. డబ్బులకు రక్షణ లేకుండా పోయిందని బ్యాంకుల్లో నగలు, డబ్బులు దాస్తుంటే.. అక్కడ కూడా మన సొత్తుకు భద్రత కొరవడింది. దీంతో ఇంట, బయట ఎక్కడ ఉంచలేక.. ఒంటిపై వేసుకుని తిరుగుతుంటే.. చైన్ స్నాచర్స్ ఎక్కువయ్యారు. రోడ్డుపై ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఉన్న గొలుసులు లాక్కెళ్లిపోయిన ఘటనలు అనేకం చూశాం. ఇప్పుడు మరో మోసం వెలుగు చూస్తుంది. వాళ్లే ప్రమాదాన్ని సృష్టించి, వారే కాపాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చి.. దొరికిన కాడికి దొరికినంత దోచుకెళుతున్నారు. ఈ తరహా మోసం ఇటీవల కేరళలో వెలుగు చూసింది.

స్కూటర్‍లో వెళుతున్న యువతిని వెనుక నుండి ఢీ కొట్టి.. సాయం చేస్తున్నామన్న నెపంతో అదిరించి, బెదిరించి నగలు దోచుకెళ్లారు కేటుగాళ్లు. కేరళలోని అలప్పుజాలోని హరిపాడ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలు ఆర్య తెలిపిన వివరాల ప్రకారం. ఆర్థిక సంస్థలో పని చేస్తున్న ఆర్య.. శనివారం యధావిధిగా విధులకు హాజరై.. తిరిగి వస్తుంది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుంది. ముట్టం చెరువు.. నార్త్ ఎన్టీపీసీ రహదారి గుండా ఇంటికి బండిపై తిరిగి వెళుతుండగా..ఆమెను వెంబడించారు ఇద్దరు యువకులు. అనంతరం వెనుక నుండి ఆమె స్కూటర్‌ను ఢీ కొట్టారు. దీంతో ఆర్య కింద పడిపోయింది. అరెరే తాము చూసుకోలేదంటూ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఏమన్నా దెబ్బలు తగిలాయా అంటూ కుశలు ప్రశ్నలు అడిగారు.

అదే నమ్మకం ఆమె కొంప ముంచింది. ఆమెను పైకి లేపినట్లు నటించి. నగలు తీసి ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆ రోడ్డులో నిర్మానుష్యంగా ఉండటంతో బెదిరించడంతో తన ఒంటిపై ఉన్న 14 గ్రాముల ఆభరణాలను వలుచుకుని తీసుకెళ్లిపోయారు. దాడి చేసే సమయంలో వారు హెల్మెట్స్ పెట్టుకుని ఉండటంతో బాధితురాలు వారెవరో గుర్తించలేకపోయింది. గట్టిగా అరిచినప్పటికీ.. ఎవరూ సాయం చేయడానికి కూడా రాలేదని పేర్కొంది బాధితురాలు. పోలీసులకు సమాచారం అందించింది ఆర్య. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలించారు. తాను తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. జుట్టు పట్టుకుని.. నగలు దోచుకెళ్లారని తెలిపింది. అయితే ఈ రోడ్డులో సరిగ్గా ట్రాఫిక్ లైట్ లేదని, రాత్రి వేళ్లల్లో సంఘ వ్యతిరేకుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇద్దరు అబ్బాయిల్ని నమ్మి.. చివరకు మోసపోయింది యువతి