iDreamPost

ఇల్లు, పిల్లల కోసం కువైట్ వెళ్లింది! తీరా అక్కడికి వెళ్ళాక!

ఓ ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలని, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని కువైట్ బాట పట్టిందో ఇల్లాలు. అక్కడకు వెళ్లిన తర్వాత.. రెండు నెలలకే తిరిగి వచ్చేస్తానని భర్తకు చెప్పింది.. చివరకు

ఓ ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలని, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని కువైట్ బాట పట్టిందో ఇల్లాలు. అక్కడకు వెళ్లిన తర్వాత.. రెండు నెలలకే తిరిగి వచ్చేస్తానని భర్తకు చెప్పింది.. చివరకు

ఇల్లు, పిల్లల కోసం కువైట్ వెళ్లింది! తీరా అక్కడికి వెళ్ళాక!

ఉపాధి కోసం కువైట్, దుబాయ్ లాంటి దేశాలకు వెళుతున్నారు భారతీయులు. అక్కడకు వెళ్లాక కానీ అసలు వెతలు తెలియడం లేదు. చిన్న చిన్న పనుల కోసం అక్కడకు వెళ్లి.. సరైన తిండి తినక, పని చేయించుకున్న జీతాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందికి గురౌతున్నారు. కువైట్‌కు వెళుతున్న వారిలో భారతీయులే అత్యధికులు. ప్రతి ఏడాది లక్షల మంది అక్కడకు పనుల కోసం వెళుతుంటారని తెలుస్తోంది. వంట మనుషులుగా, ఇళ్లలో సహాయకులుగా, డ్రైవర్లుగా, ప్లంబర్‌గానే ఇలా రకరకాల పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ జీవిస్తున్నారు. కేవలం పురుషులే కాదు.. మహిళలు కూడా వెళ్లి బాధితులు అవుతున్నారు. తాజాగా ఓ మహిళా ఉపాధి కోసం వెళ్లి శవమై తేలింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

అయితే ఇది ముమ్మాటికి హత్యే అంటున్నాడు ఆమె భర్త. కేరళకు చెందిన మహిళా ఉపాధి పని కోసం కువైట్ వెళ్లి.. అనుమానాస్పద రీతిలో మరణించింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన విజయన్, అజితా విజయన్ భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆమె కువైట్ వెళ్లి సంపాదించాలని అనుకుంది. బాగా సంపాదించి.. ఓ ఇల్లు కట్టుకోవాలని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశపడ్డ అజిత.. ఆరు నెలల క్రితం గల్ఫ్ దేశానికి పయనమైంది. ఓ ఏజెన్సీ ద్వారా ఆ దేశానికి చేరుకున్న మహిళ.. ఓ ఇంట్లో పనికి కుదిరింది. తొలుత బాగున్నప్పటికీ.. రెండు నెలలకు కష్టాలు మొదలవ్వడం స్టార్ట్ అయ్యాయి. తాను ఇక్కడ ఉండలేనని చెప్పింది. తిరిగి వచ్చేసేందుకు సిద్ధమైంది. ఇంతలో ఆత్మహత్య చేసుకుందన్న వార్త వచ్చింది.

భర్త విజయన్ చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. ‘గత మే 15న నాకు ఫోన్ చేసినప్పుడు తిరిగి ఇంటికి వచ్చేస్తానని చెప్పింది.18వ తేదీన ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యింది. 19వ తేదీ కూడా భార్య ఫోన్ చేయకపోవడంతో ఏజెన్సీని సంప్రదించినా ఆమె ఆచూకీ తెలియలేదు. అయితే అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కువైట్‌ నుంచి మృతదేహాన్ని ఇంటికి చేరవేస్తున్న ట్రావెల్స్‌ నంబర్‌ నుంచి పాస్‌పోర్టు ఫొటో తన కుమార్తె నంబర్‌కు మేసెజ్ వచ్చింది. అప్పుడు కానీ తెలియలేదు ఆమె మరణించింది అని’చెబుతున్నాడు భర్త. అజిత ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె పని చేస్తున్న ఇంటి యజమానురాలు, ఆమె కుటుంబీకులే హత్య చేసి ఉంటారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. భార్యకు ఆ కుటుంబం సరైన ఆహారం ఇవ్వలేదని, తరచూ కుళాయి నీరు తాగి బ్రతికిందని, ఇంటి యజమాని కొట్టడంతోనే దవడకు గాయమై చనిపోయిందని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ, నార్కాకు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం ఈ కుటుంబం ఎదురుచూస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి