చూడటానికి సంప్రదాయనీ.. పనులు మాత్రం సుద్దపూసనీ తలపిస్తాయి

చూడటానికి సంప్రదాయనీ.. పనులు మాత్రం సుద్దపూసనీ తలపిస్తాయి

Kerala Crime News ఈ అమ్మాయి చూడటానికి సంప్రదాయనీలా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు సుద్దపూసనీ తలపిస్తుంటాయి. కానీ పోలీసులు సైతం ఖంగుతినేలా చేసింది. ఆమె ఏం చేసిందంటే..?

Kerala Crime News ఈ అమ్మాయి చూడటానికి సంప్రదాయనీలా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు సుద్దపూసనీ తలపిస్తుంటాయి. కానీ పోలీసులు సైతం ఖంగుతినేలా చేసింది. ఆమె ఏం చేసిందంటే..?

వ్యాపారం చేయడంలో ఈ అమ్మాయి ముందు ఎవరైనా దిగదుడుపే. విలాసవంతమైన జీవితం.. గోవా, బెంగళూరు ట్రిప్స్. ఎక్కడకు వెళ్లినా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే బస. తనకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తుంది. తాను చేసే బిజినెస్ డబ్బుతోనే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఓ డౌట్ రావొచ్చు. బిజినెస్ చేస్తున్నదంటే.. అసలు తీరిక ఉండదు కదా అని. మరీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటుందని. ఆమె చేసే వ్యాపారం అలాంటి, ఇలాంటిది కాదు.. పోలీసులు సైతం ఖంగుతిన్నారు. ఇంతకు ఆ వ్యాపారం ఏంటనేగా.. మాదక ద్రవ్యాల సరఫరా. అవాక్కయ్యారు కదా. రెండు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం కేసులో తాజాగా ఈ మహిళను అరెస్టు చేశారు. ఈమెది గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ.

గత నెల 19న కేరళలోని పుయ్యింగడి ఎటక్కల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు నిర్వహించగా.. రెండు కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారని తెలిసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మొత్తం రూ. 2 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దృష్టి సారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. నిలంబూరుకు చెందిన షైన్ షాజీని తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో నిందితుడు పెరువన్నముళికి చెందిన అల్బిన్ సెబాస్టియన్‌ను అరెస్టు చేసి కుమిలిలో రిమాండ్‌కు తరలించారు.

నిందితుల్ని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వీరే కాదూ.. వీటి వెనుక మరో కిలాడీ లేడీ ఉందని గుర్తించారు. అయితే అసలైన స్మగ్లర్‌గా జుమీ అని నిర్దారించారు. షైన్ షాజీ డ్రగ్స్ కొరియర్ చేసేందుకు ఆమెనే వినియోగించే వాడని విచారణలో తేలింది. బెంగళూరు నుండి టూరిస్టు బస్సుల ద్వారా ఆమెతో డ్రగ్స్ రవాణా చేయించేవాడు. పోలీసులకు నిందితులు పట్టుబడటంతో ఆమె కూడా బెంగళూరులో తలదాచుకుంది. ఆమెను కూడా పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన జుమీ.. డ్రగ్స్ కొరియర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో విలాసవంతమైన జీవనాన్ని గడిపేది. తరచుగా గోవా, బెంగళూరు టాప్ హోటల్లోనే బస చేసేది.  ఈ కేసులో మొత్తం ముగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.  డ్రగ్ కేసులో మరెవరైనా ఉన్నారేమోనన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.

Show comments