చనిపోతూ ఆమె రాసిన మాటలు పోలీసులనే ఏడిపించాయి! ఇంత కష్టమా తల్లి?

ఆకాశంలో సగం, అవనిలో సగం అంటూ ఉమెన్స్ డే నాడు అదరగొట్టే స్పీచెస్ ఇచ్చే కొందరు మగవాళ్లు.. నిజ జీవితంలో మాత్రం ఆడ వాళ్లను చిత్ర హింసలకు గురి చేస్తుంటారు. వారిపై కనీస గౌరవాన్ని కూడా ప్రదర్శించరు. ఇక భర్త స్థానంలో ఉండే పురుషుడు అయితే..

ఆకాశంలో సగం, అవనిలో సగం అంటూ ఉమెన్స్ డే నాడు అదరగొట్టే స్పీచెస్ ఇచ్చే కొందరు మగవాళ్లు.. నిజ జీవితంలో మాత్రం ఆడ వాళ్లను చిత్ర హింసలకు గురి చేస్తుంటారు. వారిపై కనీస గౌరవాన్ని కూడా ప్రదర్శించరు. ఇక భర్త స్థానంలో ఉండే పురుషుడు అయితే..

‘కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ.. కన్నుల ఆశలు నీరై కారగ.. కట్నపు జ్వాలలో సమిధై పోయావా’ అని ఓ రచయిత పేర్కొన్నట్టుగా.. ఈ రోజుల్లో కూడా ఆడ పిల్లలు వరకట్నాలకు బాధితులవుతున్నారు. పెళ్లి చేసి పుట్టింటి నుండి అత్తారింటికి సాగనంపుతున్న ఆడపిల్ల .. పారాణి ఆరకుండానే.. తల్లికి బిడ్డ కాకుండానే, సంసారం గురించి అవగాహన రాకముందే వరకట్నానికి ఆహుతి అయిపోతుంది. తాము అబలలం కాదూ సబలమని నిరూపించుకుంటున్న ఈ ఆధునిక రాజ్యంలో కూడా ఎంతో మంది అమ్మాయిలు.. అత్తింటి వేధింపులకు, భర్త పెట్టే హింసలకు, మామ చేసే వెకిలి చేష్టలకు, ఆడపడుచు సూటి పోటీ మాటలకు గురౌతున్నారు.

కట్న కానుకలు ఇచ్చి కుందనపు బొమ్మలా చేతికి ఇస్తే.. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విగత జీవిగా అందిస్తున్నాడు అత్తారింట్లో ఉన్న రాక్షసులు. ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయి కూడా ఎంతో ధైర్య వంతురాలు.. కానీ భర్త వేధింపులు ఆమెను ఉరితాడుకు వేలాడేలా చేశాయి. చక్కనైన చుక్కను కాటికి పంపాడు ఓ దుర్మార్గుడు. ఆమె చనిపోతూ.. తాను నరకం అనుభవించిన చీకటి రోజులను సూసైడ్ నోట్‌లో రాసుకుంది.  కన్నీరు తెప్పిస్తున్న ఆ మాటల వెనుక ఆమె ఎంత నరకం అనుభవించిందో అర్థమౌతుంది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మైసూరుకు చెందిన రాఘవేంద్రతో మాండ్య జిల్లా కేఆర్ పేట్ తాలూకా లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ కుమారి (26)తో 2022లో వివాహమైంది. పెళ్లి సమయంలో ప్రేమ కుమారి కుటుంబ సభ్యులు వరకట్నం కింద రూ. 5 లక్షల కట్నం.. 150 గ్రాముల బంగారం అందించారు.

పెళ్లైన మూడు నెలలకే భర్త రాఘవేంద్ర, అతడి కుటుంబ సభ్యుల అసలు రూపం బయటకు వచ్చింది. ఆమెను అదనపు కట్నం తీసుకు రావాలంటూ వేధించారు. డబ్బులు తీసుకురాకుంటే నా ఇంట్లో స్థానం లేదని చెప్పి తిట్టేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసిన ప్రేమ కుమారి.. అక్కడే ఉంటూ చదువుకుంటోంది. కానీ మంచి వాడిగా నటిస్తూ భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక, అతడి బెదింపులను ఎదుర్కోలేక.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఐదు పేజీల సూసైడ్ లేఖ రాసింది. అందులో ’పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అతడి బండారం బయటపడింది. మరింత కట్నం తీసుకురావాలంటూ వేధించాడు.

రూ. 64 లక్షలు తీసుకురావాలంటూ హింసించాడు. డబ్బులు తీసుకు రాకపోతే…చంపేస్తానంటూ బెదిరించి నన్ను పుట్టింటికి పంపించేశాడు. ఇక్కడకు వచ్చాక చదువుకున్నాను. లాయర్ కావాలనే నా కల కూడా నెరవేరబోతుంది. కానీ అతడ్ని కోపాన్ని భరించలేకపోతున్నా. నిత్యం భయంతో బతకలేను. మంచి వాడిగా నటించి మోసం చేశాడు. నేను ధనవంతుల బిడ్డనే, కానీ అతడికి డబ్బులు ఇవ్వాలని లేదు. అతడితో జీవించాలని లేదు. నాకు చనిపోయే ధైర్యం లేదు. బతకాలన్న కోరిక లేదు’ అని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కూతురు చనిపోయిందని తెలియగానే తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రేమ కుమారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అల్లుడు రాఘవేంద్రపై కేసు నమోదు చేశారు. ఆమె సూసైడ్ నోట్ చేసి పోలీసులు సైతం చలించిపోయారు.

Show comments