iDreamPost
android-app
ios-app

ఫేస్ బుక్ లైవ్‌లో కాల్పులు.. ప్రముఖ నేత కుమారుడు మృతి

ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు. ఇద్దరు కార్యాలయాలు పక్క పక్కనే. ఒకరు రాజకీయంగా ఎదుగుతున్న వారు. ఇంకొకరు రాజకీయాల్లో రావాలని, నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఫేస్ బుక్ లైవ్ చేస్తుండగా..

ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు. ఇద్దరు కార్యాలయాలు పక్క పక్కనే. ఒకరు రాజకీయంగా ఎదుగుతున్న వారు. ఇంకొకరు రాజకీయాల్లో రావాలని, నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఫేస్ బుక్ లైవ్ చేస్తుండగా..

ఫేస్ బుక్ లైవ్‌లో కాల్పులు.. ప్రముఖ నేత కుమారుడు మృతి

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ వేదికగా ఓ ఇద్దరు వ్యక్తులు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇద్దరు పలు అంశంపై లైవ్‌లో చర్చించారు. అంతలో ఉన్నపళంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు వీక్షకులు. ఏం జరిగిందో తెలిసే లోపు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారిలో ఒకరు ప్రముఖ నేత కుమారుడు, మాజీ కార్పొరేటర్. మరొకరు అతడికి తెలిసిన వాడే కావడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ముంబయిలోని దహిసర్ ప్రాంతంలో ఉద్దవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన వినోద్ ఘోషాల్కర్ కుమారుడు, మాజీ కార్పొరేటర్ అభిషేక్ ఘోషాల్కర్, మారిస్ నోరోహ లైవ్ ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశారు.

బోరివాలి శివారు ప్రాంతంలోని ఐసి కాలనీలో మారిస్ కార్యాలయంలో ఫేస్ బుక్ లైవ్ చేపట్టారు. పలు విషయాలపై అభిషేక్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఫేస్ బుక్ లైవ్ ముగియగానే.. ఒక్కసారిగా అభిషేక్‌పై మారిస్ కాల్పులు జరిపాడు. అతడు తప్పించుకునే లోపు పలు రౌండ్లు జరిపాడు. పొత్తి కడుపులో, భుజంపై కాల్చడంతో అక్కడిక్కడే మృతి చెందాడు శివ సేన నేత. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపించింది. ఇక మారిస్ కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అభిషేక్, మారిస్ ఒకరికి ఒకరు బాగా తెలుసునని, వీరి కార్యాలయాలు కూడా పక్క పక్కనే ఉంటాయని తెలిపారు.

స్థానిక రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య ఎప్పటి నుండో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక మారిస్‌కు ఉండేదని చెబుతున్నారు. గతంలో వీరిద్దరికి గొడవలు ఉన్నాయని, అయితే ప్రాంత అభివృద్ధి కోసం వారిద్దరూ గొడవలను పక్కనెట్టి.. ఒకటయ్యారని.. అనంతరం ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం పెద్ద ఎత్తున ఉద్దవ్ శివ సేన మద్దతుదారులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై మండిపడ్డారు ఉద్దవ్ థాకరే శివసేన ఎంపీ సంజయ్ రౌత్. హోం మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఫెయిల్యూర్ అయ్యాడని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.