ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. ఆమెకి 8 నిమిషాలు నరకం చూపించి!

ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగిని. మంచి ఉద్యోగం, బంగారం లాంటి భర్త. వారికో బాబు. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఉపద్రవంలా వచ్చాడు అతడు. తొలుత ఆమెతో మంచిగానే ఉన్నాడు. రాను రానూ అతడిలో...

ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగిని. మంచి ఉద్యోగం, బంగారం లాంటి భర్త. వారికో బాబు. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఉపద్రవంలా వచ్చాడు అతడు. తొలుత ఆమెతో మంచిగానే ఉన్నాడు. రాను రానూ అతడిలో...

పిలిచి పని ఇవ్వడమే కాకుండా.. తప్పులు చేస్తున్నా సహించింది. కానీ అతడు తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. తను లేకపోతే.. ఆమెకు మరొక ఉద్యోగి దొరకడని భావించి.. దురుసుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె అతడిని పనిలో నుండి తీసేసింది. మళ్లీ వెళ్లి బతిమాలాడినా అందుకు అంగీకరించలేదు. అయితే ఇంతలో ఆమె ఇంట్లో శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు చేపట్టారు. 70 మంది సాక్షుల నుండి వాంగ్మూలం సేకరించారు. మూడు నెలలుగా విచారణ జరుగుతుంది. ఎట్టకేలకు ఆమె ఇంట్లో గతంలో పని చేసిన కారు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి.. అరెస్టు చేసి.. తమదైన స్టైల్లో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరులోని తొట్టకళ్ల సంద్రలో ప్రతిమ అనే 45 ఏళ్ల మహిళ తన భర్త, బాబుతో కలిసి జీవిస్తోంది. ఆమె ప్రభుత్వ ఉద్యోగిని. రాష్ట్ర ప్రభుత్వ గనులు, భూగర్భ శాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తుంది. ఆమె దగ్గర రెండేళ్ల క్రితం డ్రైవర్‌గా చేరాడు కిరణ్ కుమార్. నిర్లక్ష్యంగా కారు నడుపుతుండటంతో పలుమార్లు అతడిని హెచ్చరించింది. ఇలా అయితే ఉద్యోగం నుండి తీసేస్తానంటూ బెదిరించింది. అయినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు. దీంతో ప్రతిమ అతడిని ఉద్యోగంలో నుండి తొలగించింది. అయితే కిరణ్.. తనను తిరిగి కారు డ్రైవర్‌గా చేర్చుకోవాలంటూ ప్రతిమను కోరాడు. అయితే అది నువ్వు చేతులారా చేసుకుందని, ఇక ఇక్కడ నీకు ఉద్యోగం లేదని తేల్చి చెప్పింది ఉద్యోగిని.

దీంతో ప్రతిమపై కోపాన్ని పెంచుకున్న కిరణ కుమార్.. ఆమెను చంపేయాలని అనుకున్నాడు. అదును కోసం ఎదురు చూశాడు. భర్త, కొడుకు బయటకు వెళ్లిన ఓ రోజు ఇంట్లోకి వెళ్లి.. దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఇంట్లో బంగారు ఆభరణాలతో పాటు రూ. 5 లక్షలను కాజేసి పరారయ్యాడు. అయితే ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గత నవంబర్‌లో చోటుచేసుకోగా.. నిందితుడు ఎవరన్నదీ తెలుసుకునేందుకు పలువుర్ని విచారించారు. ఎట్టకేలకు కారు డ్రైవర్ కిరణ్ కుమార్ ఆచూకీ గల్లంతు కావడంతో పాటు.. ప్రతిమ పనిలో నుండి తీసేసిందని తెలుసుకుని.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం కక్కాడు. మొత్తం ఈ హత్య కాండ కేవలం ఎనిమిది నిమిషాల్లోనే జరిగిపోయిందని పోలీసులు వెల్లడించారు.

Show comments