కర్ణాటకలో జరిగిన ఈ ఘటన.. మన దేశం ఇంకా మారలేదు అనే నిజాన్ని గుర్తు చేస్తోంది!

కర్ణాటకలో జరిగిన ఈ ఘటన.. మన దేశం ఇంకా మారలేదు అనే నిజాన్ని గుర్తు చేస్తోంది!

ఈ పెద్దోళ్లున్నారో.. ఈ పిల్లలకు ఏం కావాలో తెలుసుకోరు అంటూ ఏ ఫేమస్ డైలాగ్ ఉంది. నిజమే మరీ.. పిల్లలకు ఎలాంటి దుస్తులు సెట్ అవుతాయో, ఏం చదువులు చదివించాలో పేరెంట్స్ డిసైడ్ అయిపోతుంటారు. చివరకు

ఈ పెద్దోళ్లున్నారో.. ఈ పిల్లలకు ఏం కావాలో తెలుసుకోరు అంటూ ఏ ఫేమస్ డైలాగ్ ఉంది. నిజమే మరీ.. పిల్లలకు ఎలాంటి దుస్తులు సెట్ అవుతాయో, ఏం చదువులు చదివించాలో పేరెంట్స్ డిసైడ్ అయిపోతుంటారు. చివరకు

యుగాలు మారినా, తరాలు, పరిస్థితులు మారుతున్నా మనిషిలో కొన్నింటి విషయాల్లో మార్పులు చోటుచేసుకోవడం లేదు. ముఖ్యంగా పిల్లల పెళ్లి విషయాల్లో. తమ మాట నెగ్గించుకోవాలని చూస్తుంటారు.కూతురు ఓ అబ్బాయిని ప్రేమించానని చెప్పడం ఆలస్యం.. అబ్బాయి మంచోడా కాదా అని ఎంక్వైరీ చేయకుండా.. మన కులపోడా కాదా అంటూ ఆరాలు తీస్తుంటారు. కాదని తెలిస్తే.. మా పరువు తీశావంటూ యువతి చెంప చెల్లుమనిపించడంతో పాటు ఇంట్లో బంధించేస్తుంటారు. ఇక షరతులు విధిస్తున్నారు. నిత్యం కాపాలా కాస్తుంటారు. ఇక కళ్లు గప్పి కలిసిందా.. ఆ అబ్బాయి పని గోవిందా. ఇటు అమ్మాయి వైపే కాదు. అబ్బాయి తరుఫు బంధువులు కూడా కులం ప్రేమికుల్ని విడదీస్తున్నారు. మరికొంత మంది ప్రేమికులు.. ఎలాగే తల్లిదండ్రులు మా ప్రేమకు ఒప్పుకోరని దుస్సాహసానికి పాల్పడుతుంటారు. తాజాగా కర్ణాటకలో ఓ ప్రేమ జంట అనుచిత నిర్ణయం తీసుకుని ఓకే సారి తనువు చాలించారు.

ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్థాపంతో ప్రేమికులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా రబకవిబనహట్టి తాలూకా నందగావ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సచిన్ దల్వాయి, ప్రియా మడివాలా అనే యువతీ యుకువలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇద్దరి వేర్వేరు కులాలు కావడంతో సచిన్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ప్రియాకు చెప్పాడు లవర్ సచిన్. జీవితాంతం కలిసి ఉందామని ప్రమాణాలు చేసుకున్న ఈ లవ్ జంట.. కాస్ట్ తమ జీవితంలో చిచ్చు పెట్టిందని భావించారు.

కులమే  తమ పెళ్లికి అడ్డుగోడలా నిలిచిందని ఆవేదన చెందారు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోరని సచిన్, ప్రియా ఇద్దరు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోలేక, అలాగే వాళ్లను ఒప్పించలేక మానసికంగా కుంగిపోయారు. కలిసి ఉండలేనప్పుడు చనిపోవడమే బెటర్ అని భావించారు. జీవితంలో ఒక్కటి కాలేకపోయినప్పటికీ.. మరణంలో ఒక్కటిగా చావాలని అనుకున్నారు. గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని బలవనర్మణానికి పాల్పడ్డారు. స్థానిక గ్రామస్థులు చెట్టుకు వీరి మృతదేహాలు వేళాతుండటం చూసి ఖంగుతిన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లవర్స్ ఇద్దర్ని విగతజీవులుగా చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన  చూస్తుంటే అన్నింటా దేశం వృద్ధి చెందుతున్నా.. కుల పట్టింపుల్లో మానవ నైజం మారలేదు అనిపిస్తుంది.

Show comments