Krishna Kowshik
భర్త ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటనపై భార్య ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా.. కారుతో రాజేష్‌ను కావాలనే యాక్సిడెంట్ చేసినట్లు తేలింది. వెంటనే పోలీసులకు ఊర్మిళాపై అనుమానం కలిగింది..
భర్త ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటనపై భార్య ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా.. కారుతో రాజేష్‌ను కావాలనే యాక్సిడెంట్ చేసినట్లు తేలింది. వెంటనే పోలీసులకు ఊర్మిళాపై అనుమానం కలిగింది..
Krishna Kowshik
వారిది చక్కనైన కుటుంబం. భార్య అంటే విపరీతమైన ప్రేమ భర్తకు. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు ఆ వ్యక్తి. డబ్బుకు ఎటువంటి కొదవ లేదు. భార్య, పిల్లల ఏదీ అడిగితే అది చిటికెలో తెచ్చిపెడుతుంటాడు. అన్యోన్యంగా సాగిపోతున్న కాపురం. ఈ చింతలేని కుటుంబం.. ఓ బొమ్మరిల్లు నిర్మించుకోవాలనుకుంది. భార్య కోరిక తగ్గట్లుగా కోటి రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు భర్త. ఇంతలో ఊహించని ప్రమాదం. ఆ యాక్సిడెంట్‌లో భర్త మరణించాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అది ప్రమాదం కాదూ.. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని తెలిసి విస్తుపోయారు పోలీసులు. ఇది భార్య ఆడిన నాటకం అని గ్రహించారు. భార్యను అదుపులోకి తీసుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని స్వర్ణ జయంతి విహార్‌లో నివాసముంటున్నారు రాజేష్ గౌతమ్ అతడి భార్య ఊర్మిళా కుమారి. రాజేష్ మహరాజ్ పూర్‌లోని సుబౌలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాడు. నవంబర్ 4వ తేదీన రాజేష్ మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు వస్తుండగా.. వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య ఊర్మిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక విచారణలో ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా.. కారుతో రాజేష్‌ను బలంగా ఢీ కొట్టించాడు వ్యక్తి. కారు దెబ్బతినడంతో అక్కడే వదిలేసి మరో కారులో పరారైనట్లు రికార్డు అయ్యాయి.
దీంతో భార్యపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఆమె కాల్ డేటా అన్ని పరిశీలించగా.. భార్య ఊర్మిళ, ఆమె ప్రియుడు శైలేంద్ర సోంకర్, మరో ఇద్దరు కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని తేలింది. అయితే ఈ శైలేంద్ర ఎవరో కాదూ.. భార్య కోసం కోటి రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టించిన భర్త.. ఆ బాధ్యతలు ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. ఆ కాంట్రాక్టరే శైలేంద్ర. ఆ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి.. అది అక్రమ సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. అతడిని చంపేందుకు పథకం రచించింది. రాజేష్ పేరిట ఉన్న రూ. 45 కోట్ల సొత్తు, రూ. 3 కోట్ల ఇన్ప్యురెన్స్ దోచుకుని శైలేంద్రతో కలిసి జీవించేందుకు ఊర్మిళ ప్లాన్ చేసింది.
భర్తను హత్య చేసేందుకు శైలేంద్రతో కలిసి స్కెచ్ వేసింది. దీని కోసం వికాస్ సోంకర్, సుమిత్ కతేరియాలను రూ. 4 లక్షల సుఫారీ ఇచ్చింది. నవంబర్ 4వ తేదీన రాజేష్ మార్నింగ్ వాక్‌కు వెళ్లగానే.. ప్రియుడికి ఫోన్ చేసింది ఊర్మిళ. అతడు వెంటనే వికాస్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వికాస్ కారుతో అతడిని వెనుక నుండి ఢీకొట్టాడు. దీంతో రాజేష్ మృతి చెందాడు. ఆ సమయంలో కారు చెట్టును కూడా ఢీ కొట్టి ఆగిపోయింది. అయితే సుమిత్ సాయంతో ఇద్దరూ కలిసి మరో కారులో పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రియురాలు ఊర్మిళ, ప్రియుడు శైలేంద్రతో పాటు వికాస్‌లను అరెస్టు చేశారు. సుమిత్ పరారీలో ఉన్నాడు. వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు కొందరు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.