Krishna Kowshik
భార్యా భర్తల బంధంలో గిల్లి కజ్జాలు కామన్. చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తుంటాయి. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టుకుని చూస్తూ.. సమస్యను పెద్దది చేసుకుంటున్నారు. దీంతో తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయి.
భార్యా భర్తల బంధంలో గిల్లి కజ్జాలు కామన్. చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తుంటాయి. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టుకుని చూస్తూ.. సమస్యను పెద్దది చేసుకుంటున్నారు. దీంతో తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయి.
Krishna Kowshik
కొత్తగా పెళ్లైన జంట.. జీవితంపై ఎన్నో కలలు కంటూ ఉంటారు. పిల్లలు, సంసారం, ఫ్యూచర్ ప్లాన్ అంటూ అంచనాలు వేసుకుంటారు.ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ ప్రయాణంలో సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పుడు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. భార్యా భర్తల మధ్య తగాదాలు మొదలై అపార్థాలకు దారి తీస్తుంది. కూర్చుని సాల్వ్ చేసుకోవాల్సిన మ్యాటర్‌ను ఆవేశంలో, ఈగోతో ఒకరిపై ఒకరు అరుచుకుంటూ పెద్దది చేసుకుంటున్నారు. దీంతో ఇద్దరూ ఒత్తిడి గురవుతున్నారు. పెళ్లైన కొత్తలో భార్యా భర్తల మధ్య చిర్రుబుర్రులు కామన్ అని వారి విషయాల్లోకి తల దూర్చడం లేదు తల్లిదండ్రులు. దీంతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు నవ దంపతులు.
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువుకు షాకింగ్ విషయం తెలిసింది. ఈ విషయంపై భర్తను నిలదీయగా.. సర్థిచెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో వీరి మధ్య గొడవలు జరిగి.. భార్య ఆత్మహత్య చేసుకుంది. దీనికి భర్తే కారణమని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. అంతలో అతడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వణియం పాడి ఉదయేంద్రం ప్రాంతానికి అరుణ్ కుమార్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే అతడికి తన్మోళి అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే అరుణ్ కుమార్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలియడంతో నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు రావడం స్టార్ అయ్యాయి.
పెళ్లైన నాటి నుండి గొడవలు పడుతుండటంతో పాటు.. ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో తీవ్ర ఒత్తిడికి లోనైన తన్మోళి.. ఫిబ్రవరి 4న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన్మోళి ఆత్మహత్య చేసుకోగానే ఆమె తల్లిదండ్రులు.. అరుణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు. అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీనివ్వడంతో.. నిరసన ఆపేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న చెన్నైలోని కేకేనగర్‌లో అరుణ్ కుమార్ ఉంటున్న గదికి అతడి తల్లిదండ్రులు వెళ్లగా..అరుణ్ కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేపడుతుండగానే.. భర్త కూడా తాను ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పెళ్లై 6 నెలలు కూడా తిరగకుండానే భార్యా భర్తలు చనిపోవడంపై బంధువుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.