Arjun Suravaram
Karate Kalyani Comment On Jani Master: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇష్యూపై పలువురు ప్రముఖులు స్పందించారు. తాజాగా సినీ కరాటే కల్యాణి జానీ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karate Kalyani Comment On Jani Master: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇష్యూపై పలువురు ప్రముఖులు స్పందించారు. తాజాగా సినీ కరాటే కల్యాణి జానీ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Arjun Suravaram
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయనపై ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. జానీ దగ్గర అస్టిసెంట్ గా పని చేస్తున్న ఓయువతి ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ తనపై ముంబై, చెన్నై, హైదరాబాద్ లతో పాటుగా పలు ఔట్ డోర్ షూటింగ్స్ లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నార్సింగ్ పోలీసులు ఆమె నుంచి స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు బాధితురాలి నుంచి వివరాలను సేకరించారు అధికారులు. ఇది ఇలా ఉంటే..ఈ ఇష్యూపై సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్పందిస్తున్నారు. ఇప్పటికే అనుసూయ స్పందించగా..తాజాగా ప్రముఖ నటి కరాటే కల్యాణి కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ యువతికి మద్దతుగా మాట్లాడుతూ.. జానీ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరాటే కల్యాణి మాట్లాడుతూ.. జానీ మాస్టర్..తనపై వచ్చిన ఆరోపణలను అసత్యమని రుజువు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. జానీ మాస్టర మాదిరిగానే..ఆ యువతి కూడా మంచి కొరియోగ్రాఫర్ కావాలని వచ్చిందని, అయితే అలా వచ్చిన అమ్మాయిపై లైంగిక వేంధింపులకు పాల్పడటం దారుణమని కల్యాణి అన్నారు. అంతేకా ఆయువతితో సహజీవనం కాదని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలంటూ జానీ మాస్టర్ చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
ఇప్పటికే జానీ మాస్టర్ పై వారి యూనియన్, సినీ ఇండస్ట్రీ పెద్దలు వేటు వేశారని తెలిపింది. అలానే ఆయన సపోర్టుగా ఉంటున్న ఓ పార్టీ కూడా కార్యకలాపాలకు దూరంగా పెట్టిందని ఆమె గుర్తు చేసింది. ఆ యువతి ఎంతో నరకవేదన అనువభించి ఉంటే..ఈ రోజు బయటకు వచ్చి ఉంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే..అది ఎంతటి ప్రముఖులైన, విద్యార్థి అయినా, అనామకుడైనా సరే..వదిలే ప్రసక్తి లేదు. లైంగిక వేధింపులకు గురైనట్లు చెబుతున్న ఆ యువతికి తన మద్దుతు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని కరాటే కల్యాణి అన్నారు.
ఇది ఇలా ఉంటే..జానీ మాస్టర్ ఇష్యూకు సంబంధించి..అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ఆచూకీ తెలియరాలేదు. మూడు రోజుల కిందటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి. తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు సమాచారం. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో నార్సింగ్ పోలీసులు అ క్కడికి వెళ్లారు. ఆ తరువాత లడ్డాఖ్ ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి కూడా వెళ్లి..స్థానిక పోలీసులను సంప్రదించారు. మొత్తంగా జానీ మాస్టర్ కోసం నాలుగు టీంలో గాలిస్తున్నాయి. మొత్తంగా జానీ మాస్టర్ వివాదంలో జరుగుతున్న అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.