Nidhan
Jani Master Arrest, Jani Master Wife: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
Jani Master Arrest, Jani Master Wife: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
Nidhan
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. టాలీవుడ్లో దుమారం రేపుతున్న ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని ఓ లాడ్జిలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి కోర్టులో హాజరు పరిచాక.. హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అయితే జానీ మాస్టర్ భార్య ఆయేషా పోలీసు స్టేషన్లో రచ్చ రచ్చ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నా జానీ ఎక్కడ.. అతడ్ని చూడాలి అంటూ ఆమె రచ్చ చేసింది.
జానీ మాస్టర్ నార్సింగి పోలీసు స్టేషన్లో ఉన్నట్లు ఫేక్ కాల్ రావడంతో అతడి భార్య అక్కడికి చేరుకుంది. అతడ్ని చూడాలంటూ రచ్చ చేసింది. దీంతో ఆమెకు పోలీసులు సర్దిచెప్పారు. జానీ ఇంకా హైదరాబాద్ చేరుకోలేదని, గోవా నుంచి తీసుకొస్తున్నామని తెలిపారు. సిటీకి చేరుకునేందుకు ఇంకా టైమ్ పడుతుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఆమె స్పందించింది. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఆయేషా.. జానీ మాస్టర్‌ను పీఎస్కే తీసుకొచ్చినట్లుగా ఫేక్ కాల్ రావడంతో కనుక్కునేందుకు వచ్చానని చెప్పింది. అయితే జానీ మాస్టర్ అరెస్ట్‌కు ఆమెనే కారణమని వార్తలు వస్తున్నాయి. అతడి ఆచూకీ ఆమెనే చెప్పిందని వినిపిస్తోంది. కాగా, ఈ కేసులో బాధిత లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తాను ఇచ్చిన కంప్లయింట్లో అయేషా పేరును కూడా చేర్చిన విషయం తెలిసిందే.
జానీ మాస్టర్‌ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరపరిచే అవకాశం ఉంది. కాగా, తనపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడంటూ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కానీ జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. ఆ తర్వాత పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశారు. జానీ మాస్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. బెంగళూరులో అతడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గోవాలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. జానీని హైదరాబాద్‌కు తీసుకొస్తున్న తరుణంలో అతడి భార్య పోలీసు స్టేషన్లో హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అతడు పీఎస్‌లో ఉన్నట్లు ఫేక్ కాల్ రావడంతో నా జానీ ఎక్కడంటూ ఆయేషా రచ్చ రచ్చ చేసింది. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.