iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్‌ను సొంత భార్యే పట్టించిందా? సంచలన నిజాలు!

  • Published Sep 19, 2024 | 3:00 PM Updated Updated Sep 19, 2024 | 3:03 PM

మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు. అయితే అతడ్ని పట్టించింది మరెవ్వరో కాదు.. ఆయన భార్యే అని తెలుస్తుంది.

మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు. అయితే అతడ్ని పట్టించింది మరెవ్వరో కాదు.. ఆయన భార్యే అని తెలుస్తుంది.

  • Published Sep 19, 2024 | 3:00 PMUpdated Sep 19, 2024 | 3:03 PM
జానీ మాస్టర్‌ను సొంత భార్యే పట్టించిందా? సంచలన నిజాలు!

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. డ్యాన్స్ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడంటూ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, పోక్సోతో పాటు పలు కేసులు బనాయించారు. కాగా, అప్పటి నుండి పరారీలో ఉన్నాడు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్ జానీని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. చివరకు గోవాలో ఉన్నట్లు గుర్తించి సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఆయన్ను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఆయన పట్టుబడం వెనుక ఆయన భార్య హస్తం ఉన్నట్లు సమాచారం.

కొరియోగ్రాఫర్‌ జానీ పోలీసులకు పట్టుబడ్డారన్న వార్తలకు ముందు ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చింది. గురువారం మధ్యాహ్నం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఓ ఫేక్ కాల్ రావడంతోనే ఇక్కడకు రావాల్సి వచ్చిందని మీడియాకు తెలిపింది. ఆ విషయాన్ని నిర్దారించుకునేందుకు ఇక్కడకు వచ్చానంటూ వెల్లడించింది.  కానీ పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం.. వాస్తవాలు మరోలా ఉన్నాయి. ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.  అయితే అదే సమయంలో అయేషాను పోలీసులు విచారించారని,  భర్త ఆచూకీ తెలపాలని కోరడంతో జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నది చెప్పినట్లు తెలుస్తుంది.  దీంతో ప్రత్యేక బృందం గోవాలో డ్యాన్స్ మాస్టర్ జానీని అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య సమాచారం ఇవ్వడంతోనే ఆయన్ను పట్టుకోగలిగారు పోలీసులు. మరి కొన్ని గంటల్లో జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వస్తారు. అనంతరం కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నాయి.

గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ.. 24 గంటల్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుర్చాలని తెలంగాణ ఎస్‌వోటీని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ మాత్రమే కాదు.. ఆయన భార్య అయేషా సైతం తనపై దాడి చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. మతం మార్చుకుని, తన భర్తను వివాహం చేసుకోవాలని నార్సింగిలోని తన ఇంటికి వచ్చి గొడవ చేశారంటూ పేర్కొంది. ఇక జానీ మాస్టర్ అయితే తనను ఔట్ రోడ్ షూటింగ్స్, వ్యానిటీ వ్యాన్, తన ఇంట్లో పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని, ప్రతిఘటిస్తే తనపై దాడి చేశాడని, అంతేకాకుండా.. షూటింగ్ సమయంలోనే అసభ్యకరంగా తనను తాకేవాడంటూ తెలిపింది. మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా తనకు పని ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న జానీని భార్య ఇచ్చిన సమాచారంతోనే అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. జానీ మాస్టర్ పట్టుబడం వెనుక ఎవరి హస్తం ఉందని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss